వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ జాతీయ కార్యవర్గంలో రాం మాధవ్ ,మురళీ ధర్ రావులకు నో ప్లేస్ .. ఆసక్తికర చర్చ

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతా పార్టీ జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మహిళలకు సముచిత స్థానం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ కార్యవర్గంలో కీలక భూమిక పోషిస్తున్న కొందరు నేతలకు మాత్రం జాతీయ కమిటీలో స్థానం కల్పించలేదు .

 తెలుగురాష్ట్రాల నుండి నలుగురికే అవకాశం

తెలుగురాష్ట్రాల నుండి నలుగురికే అవకాశం

జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల తర్వాత ఆయన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అయితే ఈ కార్యవర్గంలో జాతీయ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్న నేతలకు అవకాశం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కేవలం నలుగురికి మాత్రమే అవకాశం దక్కింది.
జాతీయ కార్యవర్గంలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణకు స్థానం దక్కగా, జాతీయ ప్రధాన కార్యదర్శి గా దగ్గుబాటి పురంధరేశ్వరి కి అవకాశం దక్కింది. జాతీయ కార్యదర్శిగా సత్య కుమార్ కు, ఓబీసీ జాతీయ మోర్చ అధ్యక్షుడిగా, తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు జాతీయ కార్యవర్గంలో చోటిచ్చారు జేపీ నడ్డా.

 మురళీధర్ రావు, రాం మాధవ్ లకు నో ఛాన్స్

మురళీధర్ రావు, రాం మాధవ్ లకు నో ఛాన్స్


తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జాతీయ నేతలుగా గుర్తింపు ఉన్న మురళీధర్ రావు కు, రామ్ మాధవ్ లకు జాతీయ ప్రధాన కార్యదర్శి గా పదవులు దక్కలేదు. ఇక జాతీయ అధికార ప్రతినిధి జాబితాలో జీవీఎల్ నరసింహారావు కు చోటు దక్కలేదు. పలువురు సీనియర్ నాయకులు జాతీయ కమిటీలో అవకాశం కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నా వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. జాతీయ కార్యవర్గం ఎంపికలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంది బీజేపీ అధిష్టానం .

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు ఇచ్చే అవకాశం .. ఆసక్తికర చర్చ

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు ఇచ్చే అవకాశం .. ఆసక్తికర చర్చ

అయితే రాం మాధవ్ , మురళీధర్ రావులకు స్థానం కల్పించకపోవడం పై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. రామ్ మాధవ్, మురళీధర్ రావు లకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించే అవకాశం ఉందని చర్చ జోరుగా సాగుతోంది. ఇక జీవీఎల్ నరసింహారావు కు దక్షిణాదిలో ఏదైనా ఒక రాష్ట్రానికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా జాతీయ కమిటీ లో ఇద్దరు మహిళలకు స్థానం దక్కడం విశేషమైతే, రాష్ట్రాల వారీగా వ్యూహాత్మకంగానే ఈ పేర్లను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ పరంగా మార్పులు చేసిన బిజెపి అధిష్టానం, మంత్రివర్గంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

English summary
National President JP Nadda has not given a seat in the National Committee to ram madhav and muralidhar rao who play a key role in the National Working Committee from the Telugu states. GVL Narasimha Rao also did not get a place in the list of national spokesperson.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X