వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి మండలిలో చోటు దక్కని రోజా..! ఆవేదనలో జబర్ధస్త్ జడ్డ్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రెండు వారాల నిరీక్షణ అనంతరం మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేశారు. టీడీపీకి పట్టుకొమ్మలయిన బీసీలను ముందు నుంచి టార్గెట్ చేస్తూ వస్తున్న జగన్ మంత్రి వర్గంలోనూ వారికి ఎక్కువ పోస్టులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం 25 మంది మంత్రుల్లో...ఏడుగురు బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కాగా ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపు, నలుగురు రెడ్డి, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే వైసీపిలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆర్కే రోజా ను మాత్రం జగన్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉన్న రోజాను మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడానికి కారణాలేంటి. .? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

 అంకిత భావంతో పని చేసిన రోజా..! క్యాబినెట్ లో చోలు లేకపోవడంతో ఆవేదన..!!

అంకిత భావంతో పని చేసిన రోజా..! క్యాబినెట్ లో చోలు లేకపోవడంతో ఆవేదన..!!

పాపం అభిమానులు చేసిన కలల ప్రచారానికి గాల్లో తేలియాడుతున్న నగరి ఎమ్మెల్యే రోజా ఒక్కసారిగా గుక్కపట్టి ఏడుస్తోంది. జగన్ కుల సమీకరణ రాజకీయాల్లో దారుణంగా మోసపోయిన ఈ తెలుగింటి ఆడపడుచు 2014లో జగన్ వస్తే తానే మంత్రిని అని కలలు కన్నారు. పాపం 2019లో వచ్చి ఆమె రెండు సార్లు వరుసగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదు. ఎంతో ఆశలు పెట్టుకున్న పదవిపై జగన్ వైజాగ్ ఆశ్రమం నుంచి తెచ్చిన విబూది చల్లేసినట్టు తెలుస్తోంది.

తన కలలను బూడిదపాలు చేశారు..! ఎప్పుడూ ఏదో ఆటంకంలో రోజా..!!

తన కలలను బూడిదపాలు చేశారు..! ఎప్పుడూ ఏదో ఆటంకంలో రోజా..!!

25 మందితో జగన్ పెద్ద జంబో కేబినెట్ ఏర్పాటుచేసినా రోజాకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆమె వేదన వర్ణనాతీతంగా ఉంది. చాలా రోజుల నుంచి మీడియా కూడా రోజాకు బెర్త్ దాదాపు ఖాయం అని రాయడంతో ఆమె ఆశలు రెట్టింపయ్యాయి. కానీ జగన్ ఆమెను జబర్దస్త్ కే పరిమితం చేసేశారు. ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన మంత్రుల జాబితాలో రోజా పేరు లేకపోవడంతో ఆమె అభిమానులు కలత చెందారు. కాకపోతే కోట్లాది మంది జబర్దస్త్ అభిమానులు సంతోషంగా ఫీలయ్యారు. ఎందుకంటే వారు రోజాను మిస్ కావట్లేదు.

 రోజా పరిస్థితి దారుణం..! దెబ్బ తీసిన కుల సమీకరణాలు..!!

రోజా పరిస్థితి దారుణం..! దెబ్బ తీసిన కుల సమీకరణాలు..!!

రోజాకు మంత్రి పదవి దక్కకపోవడం వెనుక పెద్ద లెక్కలే ఉన్నాయి. రోజా చిత్తూరు జిల్లాలోని నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. అదే జిల్లా నుంచి బలమైన రెడ్డి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కడంతో ఒకేసారి ఇద్దరు రెడ్లకు ఒకే జిల్లా నుంచి మంత్రి పదవి ఇవ్వడం జగన్ కు కుదరలేదు. పైగా బీసీలకు ఎక్కువ పదవులు కేటాయించే క్రమంలో ఆ విధంగా కూడా రోజా నష్టపోయింది.

ఎదురు చూపులు తప్పవా..? రెండో సారి దక్కుతుందా?

ఎదురు చూపులు తప్పవా..? రెండో సారి దక్కుతుందా?

అయితే, రోజాలో కొత్త ఆశ మొదలైంది. ఎలాగూ రెండున్నరేళ్లే కాబట్టి సెకండ్ టర్మ్ కేబినెట్లో పదవి దక్కుతుందని రోజా అభిమానులు ఆలోచిస్తున్నారట. కానీ అపుడు కూడా సమీకరణాలు కుదిరేలా లేవు. ఎందుకంటే... జిల్లా నుంచి భూమన కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లైన్లో ఉన్నారు. రోజాతో పోలిస్తే జగన్ కి వాళ్లే ఇంపార్టెంట్. అంటే 2024 మాత్రమే రోజాకు ఎదురుచూపులు తప్పేట్టు కనిపించడం లేదు.

English summary
AP Chief Minister, YS Jaganmohan Reddy, set up a two-week wait after the cabinet. Though the Jagan cabinet was set up with 25 people, Roja was not the minister. Her agony is painfull. Her hopes have been drawn since several days since the media has also written that Berth is almost confirmed. But Jagan has restricted her to Zabardath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X