వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద మృతి: డాక్టర్‌పై ఒత్తిడి లేదన్న ఎయిమ్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

No pressure on Dr Sudhir on Sunanda Pushkar's autopsy report, says AIIMS
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ పోస్టుమార్టం నివేదిక విషయంలో తనపై ఒత్తిడి వచ్చిందన్న ఫోరెన్సిక్ శాఖ అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా ఆరోపణలను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఖండించింది. సునంద పుష్కర్ పోస్టుమార్టం నివేదికను మార్చాలని ఏ మాత్రం సుధీర్ గుప్తాను అడగలేదని స్పష్టం చేసింది.

ఈ కేసులో తనపై ఒత్తిడి వచ్చినట్లు సుధీర్ గుప్తా ఎప్పుడు కూడా చెప్పలేదని ఎయిమ్స్ మీడియా, ప్రోటోకాల్ డివిజన్ చైర్‌పర్సన్ డాక్టర్ నీరజా భాట్లా, అధికార ప్రతినిధి డాక్టర్ అమిత్ గుప్తా చెప్పారు. సుధీర్‌పై బయటివారినుంచి ఒత్తిడి వచ్చి ఉంటే తామేమీ చెప్పలేమని వారన్నారు.

ఆరోపణలను రుజువు చేయడానికి సాక్ష్యాలతో సుధీర్ గుప్తా ముందుకు రావాల్సి ఉండిందని వారన్నారు. సుధీర్ గుప్తాను ఫోరెన్సిక్ డిపార్టుమెంట్‌లో కొనసాగించాలా, వద్దా అనే విషయంపై ఎయిమ్స్ పాలనాయంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని వారు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

సుధీర్ గుప్తా ఎందుకు భయపడ్డారనే విషయం పాలనావిభాగంలోని ఎవరికి కూడా తెలియదని, సుధీర్ గుప్తా సెలవులో ఉన్నారని, ఆయనను తాము సంప్రదించలేకపోయామని, అతను పరారీలో లేరని వారు వివరించారు.

English summary
All India Institute of Medical Sciences (AIIMS) has refuted the allegations levelled by Forensic Department head Dr Sudhir Gupta over Congress MP Shashi Tharoor's wife Sunanda Pushkar's autopsy report. AIIMS officials claimed that there was no pressure from the institute on Dr Sudhir Gupta to amend Sunanda Pushkar's autopsy report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X