వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌తో పరిచయమే లేదు, చిరంజీవికి సలహ ఇచ్చా:పరిటాల రవి

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan Tour : Pawan Kalyan About His Clash With Paritala Ravi

అనంతపురం: సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌కు మాజీ మంత్రి దివంగత టిడిపి నేత పరిటాల రవి కుటుంబాల మధ్య వివాదాలున్నాయా అనే విషయమై మరో సారి చర్చ సాగుతోంది. పరిటాల రవి తనకు గుండు చేయించారనే ప్రచారాన్ని కొట్టి పారేశారు. జిల్లాల పర్యటనలో ఉన్న పవన్‌కళ్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు.అయితే చిరంజీవితో కానీ, పవన్‌కళ్యాణ్‌తో కానీ, తనకు ఎలాంటి విబేధాలు లేవని పరిటాల రవి చనిపోవడానికి ముందే ప్రకటించారు.

అయితే పరిటాల రవి కుటుంబానికి చిరంజీవి కుటుంబానికి మధ్య విభేధాలున్నాయనే ప్రచారం కూడ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సాగింది. ఈ విషయమై మీడియాలో సాగిన ప్రచారంపై పవన్‌కళ్యాణ్ ఆ సమయంలోనే ఖండించారు.

టిడిపికి ఎందుకు మద్దతివ్వాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ చెబుతూ పరిటాల రవి వ్యవహరాన్ని తాజాగా ప్రస్తావించారు. ఇదంతా ఒట్టిదేనని ఆయన తేల్చి పారేశారు.అయితే పరిటాల రవి చనిపోవడానికి ముందు అనంతపురం జిల్లా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఈ విషయమై పరిటాల తేల్చి చెప్పారు. ఓ తెలుగు దినపత్రికలో పనిచేసే మీడియా ప్రతినిధి ఆ సమావేశానికి వెళ్ళారు. ఆయన ఆ రోజు పరిటాల రవి చెప్పిన విషయాలను ఆ పత్రికలో ఆయన ప్రస్తావించారు.

పవన్ కళ్యాణ్‌పై పరిటాల ఏమన్నారు

పవన్ కళ్యాణ్‌పై పరిటాల ఏమన్నారు

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2005లో పరిటాల రవి హత్యకు గురయ్యారు. అయితే పరిటాల రవి హత్యకు కొన్ని రోజుల ముందు అనంతపురం జిల్లాకు చెందిన మీడియా ప్రతినిధులతో పరిటాల రవి మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌‌కు తాను గుండు గీయించాననే వార్తలను పరిటాల తోసిపుచ్చారు. ఈ ప్రచారంలో వాస్తవవం లేదని పరిటాల రవి కొట్టిపారేశారు.ఈ ప్రచారం అంతా ఒట్టిదేనని పరిటాల రవి ఆనాడు మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీగా చెప్పారు.

పవన్‌కళ్యాణ్‌తో పరిచయమే లేదు

పవన్‌కళ్యాణ్‌తో పరిచయమే లేదు

పవన్‌తో నాకు పరిచయం కూడా లేదని పరిటాల రవి ఆనాడు మీడియా ప్రతినిధులతో పిచ్చా పాటీగా మాట్లాడుతూ చెప్పారు. . బహుశా పవన్‌ తిరుమలకు వెళ్లి తలనీలాలు ఇచ్చి ఉంటారు. అది తెలియక గిట్టనివాళ్లు ఏదో ప్రచారం చేసి ఉంటారని రవి వివరించారని ఆ సమయంలో పరిటాల రవి మీడియా సమావేశానికి హజరైన మీడియా ప్రతినిధులు గుర్తు చేసుకొంటున్నారు.

చిరంజీవికి సలహ ఇచ్చా

చిరంజీవికి సలహ ఇచ్చా

హైద్రాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో నా ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేయాలని చిరంజీవి భావించారు. అయితే నేను వద్దని సలహా ఇచ్చాను. నాకు భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి

. అక్కడకు వచ్చిపోయే వాహనాలను మా వాళ్లు ఆరా తీస్తుంటారు. చిరంజీవి అక్కడకు వస్తే ఆయనకు ఇబ్బందిగా ఉంటుంది. ఆయన కోసం వచ్చేవారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వద్దన్నాను. ఆయన కూడా ఆ స్ధలం తీసుకోలేదు. అదొక్కటే తప్ప చిరంజీవి కుటుంబంలో ఎవరితోనూ నాకు సమస్యలు లేవని పరిటాల రవి ఆనాడు మీడియా ప్రతినిధులతో చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావిస్తున్నారు.

వెంకటాపురంలో మీడియాతో

వెంకటాపురంలో మీడియాతో

చనిపోవడానికి కొంత కాలం ముందే పరిటాల రవి మీడియా ప్రతినిధులతో సుదీర్ఘంగా మాట్లాడారు.ఆ సమయంలో ఈ సమావేశానికి హజరైన మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తుతం ప్రస్తావిస్తున్నారు. ఆనాడు పరిటాల రవి తమతో ఏం మాట్లాడారనే విషయాన్ని గుర్తు చేసుకొంటున్నారు.అయితే పరిటాల రవి మీడియా సమావేశానికి హజరైన కొందరు మీడియా ప్రతినిదులు ఆనాడు మీడియా ప్రతినిధులతో పరిటాల రవి చేసిన సంభాషణను గుర్తు చేసుకొంటున్నారు. ఓ తెలుగు దినపత్రికలో పనిచేసే రిపోర్టర్ ఆనాడు పరిటాల రవితో మీడియా ప్రతినిధులకు మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకొన్నారు. ఈ విషయమై ఆ పత్రికలో కథనం ప్రచురించింది

English summary
No problems with Chiranjeevi family with me said Paritala Ravi.When paritala ravi was before six months dying spoke to media persons.media persons were remembered what paritala ravi said in this conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X