కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకా హ‌త్య కేసు: తేల్చ‌ని పోలీసులు..మౌనంగా కుటుంబ స‌భ్యులు: కొత్త ప్ర‌భుత్వం తేల్చాల్సిందేనా..!

|
Google Oneindia TeluguNews

రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించిన వైయ‌స్ వివేకా హ‌త్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పోలీసులు విచార‌ణ సాగిస్తూనే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురిని అరెస్ట్ చేయటం మిన‌హా...హ‌త్య జ‌రిగి రెండు నెల‌లు పూర్త‌యినా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు రాలేదు. వైయ‌స్ వివేకా కుటుంబ స‌భ్యులు మౌనంగా ఉంటున్నారు. దీంతో..కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన త‌రువాత‌నే వివేకా హ‌త్య కేసు ఒక కొలిక్కి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

వివేకా హ‌త్య‌..రెండు నెల‌లు పూర్తి..

వివేకా హ‌త్య‌..రెండు నెల‌లు పూర్తి..


వైయ‌స్ వివేకా హ‌త్య జ‌రిగి రెండు నెల‌లు పూర్త‌యింది. వివేకా మృతి తొలుత గుండెపోటుతో మృతి చెందాని చెప్పారు. ఆ త‌రువాత ఇది హ‌త్య‌గా నిర్ధారించారు. దీంతో..ఏపీ ప్ర‌భుత్వం వివేకా హ‌త్య పైన సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాశ్‌, ఎర్రగంగిరెడ్డిలు సాక్ష్యాధారాలు తారుమారు చేశారని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. వివేకా హ‌త్య కేసు రాజ‌కీయంగానూ క‌ల‌క‌లం సృష్టించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌ర‌గ‌టంతో టీడీపీ నేత‌లే ఈ హ‌త్య చేయించార‌ని వైసీపీ నేత‌లు ఆరోపించారు. జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకొని సొంత చిన్నాన్న‌ను చంపేసారంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. దీని పైన వివేకా కుమార్తె సునీత ఎన్నికల సంఘాన్ని..కేంద్ర హోం శాఖ‌ను..హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో..కోర్టు ఆదేశాల మేర‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో వివేకా హ‌త్య ప్ర‌స్తావ‌నకు బ్రేక్ ప‌డింది.

ఎస్పీ మార్పు..11 బృందాలు ఏర్పాటు..

ఎస్పీ మార్పు..11 బృందాలు ఏర్పాటు..

ఎన్నిక‌ల సమ‌యంలో జ‌రిగిన హ‌త్య‌..రాజ‌కీయంగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు వివేకా హ‌త్య కేసు ప‌ర్య‌వేక్షిస్తున్న రాహుల్ దేవ్ శ‌ర్మ‌ను బ‌దిలీ చేస్తూ ఆయ‌న స్థానంలో ఇదే కేసులో సిట్‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న అభిషేక్ మ‌హంతిని క‌డ‌ప ఎస్పీగా నియ‌మించారు. ఆయ‌న ఈ కేసును అప్ప‌టికే ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ కేసును నిగ్గు తేల్చేందుకు 11 బృందాలను నియమించి ఒక్కో బృందానికి ఒక్కో బాధ్యత అప్పగించారు. అరెస్ట్ చేసిన ముగ్గురి నుండీ సేక‌రించిన స‌మాచారం ఆధారంగా మాండు రిపోర్టులో సాక్ష్యాధారాలు ఎలా తారుమారు చేసిందీ, వివేకాను క్రూరంగా హింసించిన తీరును ప్రస్తావిస్తూ హత్య మొదలు విచారణ వరకు జరిగిన పరిణామాలన్నీ పేర్కొన్నారు. సాక్ష్యాధారాలు తారు మారు చేసిన ఆ ముగ్గురు నోరు విప్పితే నిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటూ వారికి బెయిలు మంజూరు చేయవద్దని కోర్టుకు విన్నవించారు. దీంతో..ప్రస్తుతం ఈ ముగ్గురు కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

కొత్త ప్ర‌భుత్వంలో తేలాల్సిందేనా..

కొత్త ప్ర‌భుత్వంలో తేలాల్సిందేనా..

వైయ‌స్ వివేకా హ‌త్య జ‌రిగి రెండు నెల‌లు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన ఎస్పీ సైతం దీని పైన ఏదీ తేల్చలేదు. ఆరోప‌ణ‌లు..అనుమానాల‌కు అనుగుణంగా ఏర్పాటు చేసిన 11 ప్ర‌త్యేక బృందాలు విచార‌ణ‌లో పురోగ‌తి సాధించ‌లేదు. ఇక‌, ఇదే స‌మ‌యంలో వివేకా కుటుంబ స‌భ్యులు సైతం కొద్ది రోజులుగా ఈ హ‌త్య గురించి ఎక్క‌డా మాట్లాడ‌టం లేదు. కేసు విచార‌ణ పైనా ఎటువంటి డిమాండ్లు చేయ‌టం లేదు. మ‌రో వారం రోజుల్లొ ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. దీంతో..కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన త‌రువాత మాత్ర‌మే ఈ కేసు వ్య‌వ‌హారం..వాస్త‌వాలు ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

English summary
YS Viveka Murder Case investigation is still in process. Kadapa District SP Mohanti appointed 11 specail teams for this case investigation. After new government formation only case may move forward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X