వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ మరో సంచలనం- చంద్రబాబు హయాం విధానాలకు చెక్‌- ఉద్యోగులకు భారీ ఊరట...

|
Google Oneindia TeluguNews

1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఉద్యోగుల విషయంలో కరకుగా వ్యవహరించేవారు. ఆకస్మిక తనిఖీలు, నిర్లక్ష్యంగా ఉండే అధికారుల సస్పెన్షన్లు ఇలా వారికి చుక్కలు చూపించేవారు. ఆ సమయంలోనే పని రాక్షసుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వనంటూ చంద్రబాబు అప్పట్లో చెప్పిన డైలాగ్‌ కూడా ఉద్యోగులకు గుర్తుండిపోయింది. దీంతో చంద్రబాబు పాలన వచ్చిందంటే చాలు ఉద్యోగులు హడలిపోతుంటారు. చివరికి 2004లో ఆయన ఓటమికి కూడా అదో కారణంగా నిలిచిపోయింది.

మళ్లీ తెరపైకి చంద్రబాబు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు-జగన్, కేసీఆర్‌పై కేసులు- కొత్త సిట్‌ ఛీఫ్‌..మళ్లీ తెరపైకి చంద్రబాబు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు-జగన్, కేసీఆర్‌పై కేసులు- కొత్త సిట్‌ ఛీఫ్‌..

2014లో మరోసారి సీఎం అయ్యాక కూడా ఉద్యోగులతో గంటల తరబడి సమీక్షలు నిర్వహించేవారు. దీంతో ఉద్యోగులు అర్ధరాత్రి వరకూ ఆఫీసుల్లోనే సమీక్షలతో కాలం గడిపే పరిస్ధితి ఉండేది. చివరికి ఆయన 2019లో అధికారం కోల్పోయే వరకూ కూడా ఉద్యోగులకు ఈ కష్టాలు తప్పలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ కేబినెట్‌ సమావేశాలు, సమీక్షలు, సాధారణ సమావేశాలు సైతం పని గంటల్లోనే జరగాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీఎం నిర్వహించే సమీక్షలన్నీ పగటి పూట పనిగంటల్లోనే ఉంటున్నాయి. కానీ గతంలో చంద్రబాబు హయాం నుంచి అలవాటుపడిపోయిన సమీక్షలను అధికారులు మాత్రం సెలవురోజుల్లో సైతం కొనసాగించేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాయి.

no review meetings in holidays and after duty time, andhra cm jagan order officials

ఉద్యోగులతో నిర్వహించే సమీక్షలు, సమావేశాలు పని వేళల్లోనే ఉండాలని, పని గంటలు ముగిశాక ఎట్టి పరిస్దితుల్లోనూ వాటిని నిర్వహించవద్దని సీఎం జగన్ తాజాగా ఆదేశాలు ఇచ్చారని రెవెన్యూ సేవల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్యంగా ఈ ఆదేశాలు రెవెన్యూశాఖతో పాటు జిల్లాలకు అధిపతులుగా ఉన్న కలెక్టర్లు, జేసీలు, ఇతర ఉన్నతాధికారులు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలని సీఎం జగన్‌ సూచించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే జగన్‌ స్వయంగా ఈ విధానం పాటిస్తుండగా. ఇప్పుడు కలెక్టర్లకూ ఈ ఆదేశాలు వెళ్లడంతో ఉద్యోగులకు భారీ ఊరట లభించినట్లవుతుంది.

English summary
andhra pradesh chief minister ys jagan has ordered higher officials not to hold any review meetings in holidays and after duty hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X