వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఇసుక కొరత తీరింది.. వారంలో రూ.63 కోట్ల విక్రయాలు: మంత్రి పెద్దిరెడ్డి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత తీరిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. వారం రోజుల్లో రోజుకు రూ.63 కోట్ల విలువైన ఇసుక విక్రయాలు జరిగాయని మంత్రి తెలిపారు. ఇసుక వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఇసుక వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల్లో రూ.63 కోటల విలువైన ఇసుక విక్రయాలు జరిగాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్ బుకింగ్ పకడ్బందీగా నిర్వహించామని చెప్పారు. దీంతో 2.82 లక్షల టన్నుల రోజువారీ ఇసుక తవ్వకాలు జరిగాయన్నారు. బల్క్, వ్యక్తిగత ఆర్డర్‌లకు నిబంధనల ప్రకారం ఇసుకను కేటాయిస్తున్నామని తెలిపారు.

no sand Shortage in ap:minister peddireddy ramachandra reddy

ఇసుక కొరత తీరడంతో నిర్మాణరంగం ఊపందుకున్నాయని తెలిపారు. దీంతో వచ్చే ఐదేళ్లకు సరిపడేంత ఇసుక మేటలు వేశాయని చెప్పారు. జిల్లాలవారీగా ధరల జాబ్ కార్డులు విడుదల చేస్తామని వెల్లడించారు.

ఇసుక ధరలను నియంత్రించే దిశగా ప్రభుత్వం చర్యలు ఫలించాయని పేర్కొన్నారు. మరోవైపు ఇసుక అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. వారికి రూ.2 లక్షల జరిమానా విధిస్తామని తేల్చిచెప్పారు. దీంతోపాటు రెండేళ్ల జైలుశిక్ష కూడా విధిస్తామని హెచ్చరించారు.

English summary
In ap no sand Shortage says minister peddireddy ramachandra reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X