వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేల కోట్ల ప్రాజెక్టులు కాదు... పర్యావరణ పరిరక్షణ ముఖ్యం : సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 2 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ నిషేధం కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ ఇదే విధానాన్ని అవలంభించేందకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆధికారులను ఆదేశించారు. అటవీ, పర్యావరణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం పర్యవరణ పరిరక్షణపై పలు కీలక సూచనలు చేశారు.

కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది.

కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది.

గురువారం సాయంత్ర పర్యావరణం సమతుల్యంపై చర్చించేందుకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పలు ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అనంతరం పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. కంపనీల నుండి వస్తున్నవ్యర్థాల్లో కేవలం ముప్పై శాతం మాత్రమే శుద్ది చేస్తున్నారని పేర్కోన్న సీఎం మిగతా 70 శాతం మేర వావతరణంలోకి వదిలేస్తున్నారని చెప్పారు.

వేలకోట్లు వస్తుంటే రెడ్ కార్పెట్ వేస్తాం...

వేలకోట్లు వస్తుంటే రెడ్ కార్పెట్ వేస్తాం...

ఈ నేపథ్యంలోనే ఏపీలోని కాలుష్య నియంత్రణ బోర్డు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కార్పోరేట్ కంపనీలు వస్తున్నాయంటే రెడ్ కార్పేట్ పరుస్తామని, కాని వాటి వల్ల ఎలాంటీ కాలుష్యం వెదజల్లుతుందో ఆలోచించకుండా వాతవరణానికి, పర్యావరణానికి భంగం కల్గుతుందనే కనీస అవగహాన కూడ చేయమని చెప్పారు. రాష్ట్రానికి ఎన్నివేల కోట్ల రుపాయల ప్రాజెక్టులు వస్తున్నాయనే అంశం తప్ప కాలుష్యం గురించే స్థాయిలో కాలుష్య నియంత్రణ మండలి లేదని అన్నారు.

విశాఖను కాపాడుకోవాలి...

విశాఖను కాపాడుకోవాలి...


విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కాలుష్యంతో సతమతవుతుందని హెచ్చిరించిన సీఎం కాలుష్యనియంత్రణ చేయకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు నగరంలో పెద్ద పీట వేయాలని ఆయన అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కాలువల్లో నుండి వస్తున్న మురుగు నీటీని శుద్ది చేసిన తర్వాతే వదిలిపెట్టాలని ఆయన ఆదేశించారు. దీంతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లోని కాల్వలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. ఇందుకోసం సరైన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

 ప్రతి ఇంటికి నాలుగు మొక్కలు..

ప్రతి ఇంటికి నాలుగు మొక్కలు..

ఇక పర్యవరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఇంటికి నాలుగు మొక్కలు పంపీణి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ వాలింటర్లను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఇండ్లతోపాటు పోలం గట్లపై కూడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చెప్పారు. ఇందులో భాగంగానే కడప, అనంతపురం జిల్లాల్లో అడవులను పెంచే కార్యక్రమాన్ని చాల సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. మొక్కలు పెంచడం ద్వార ఆయా జిల్లాల్లో ఉన్న నైసర్గిక స్వరూపాన్ని మార్చాలని అధికారులకు చెప్పారు.

English summary
single-use plastic should ban, Andra pradesh governament cm jaganamohan reddy has given oredrs to the officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X