వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు ముందు ఆఫ్షన్స్, బిజెపిలో చేరడం లేదని రుద్రరాజు

By Srinivas
|
Google Oneindia TeluguNews

No truth in reports that Chiernjeevi is joining the BJP, says Rudraraju
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, తమ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, సీనియర్ శాసన మండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు గురువారం స్పష్టం చేశారు. చిరంజీవి బిజెపిలోకి వెళ్లరని, సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

చిరు ముందు మూడు ఆప్షన్స్!

చిరంజీవి ముందు ప్రస్తుతం మూడు రకాల ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చిరు బిజెపిలో చేరుతారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో 150వ సినిమా పైన కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో.. సినిమాలు తీస్తూ కాంగ్రెసులో కొనసాగడం, 2019 టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించడం, పూర్తిగా సినిమాల పైనే దృష్టి సారించడంలో చిరు ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొంది.

ఇప్పటికే సినిమాలు, రాజకీయాల పైన తర్జన భర్జన పడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల పైన పూర్తిగా దృష్టి సారించాలా లేక రాజకీయాల పైన సారించాలా అనే విషయమై ఎటు తేల్చుకోలేకపోతున్నారట. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు.

అనంతరం కాంగ్రెసు పార్టీ ఆయనను రాజ్యసభకు పంపించి... పర్యాటక శాఖను అప్పగించింది. ఇప్పుడు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో కనీసం ఒక్క ఎమ్మెల్యే, ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇక కేంద్రంలో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పరాభవం ఎదురైంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీలో చిరంజీవి స్థానంపై అభిమానుల్లో, సీమాంధ్ర కాంగ్రెసులో జోరుగా చర్చ సాగుతోంది.

మరో ఐదేళ్ల వరకు చిరంజీవికి ఎక్కువ శాతం విశ్రాంతే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చిరు 150 సినిమా పైన దృష్టి సారిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో సినిమా పైన దృష్టి సారించాలా లేక 150వ సినిమా పూర్తయ్యాక రాజకీయాల పైన దృష్టి పెట్టాలా, రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారిస్తే బిజెపిలో చేరుతారా లేక కాంగ్రెసులో కొనసాగుతారా అనే చర్చ సాగుతోంది. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం బిజెపిలో చేరే ప్రచారాన్ని కొట్టి పారేస్తోంది.

English summary
There is no truth in reports that Chiernjeevi is joining the BJP, says Rudraraju Padmaraju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X