• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆరునెలలు టైం కూడా అనవసరం అనిపిస్తుంది .. ఇక అసెంబ్లీలో నిలదీసుడే అంటున్న చంద్రబాబు

|

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మొదట ఆరు నెలలు సమయం ఇద్దామని టిడిపి భావించింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ నాయకులతో ఇదే విషయాన్ని చెప్పారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ కు అంత సమయం ఇవ్వడం అనవసరం అనిపిస్తుంది అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

 టిడిపి కార్యకర్తల పైన దాడులు, బెదిరింపులు .. ఆర్నెల్ల సమయం మౌనంగా ఉండటం అనవసరం అన్న చంద్రబాబు

టిడిపి కార్యకర్తల పైన దాడులు, బెదిరింపులు .. ఆర్నెల్ల సమయం మౌనంగా ఉండటం అనవసరం అన్న చంద్రబాబు

టిడిపి ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు శాసన మండలి వేదికగా , అసెంబ్లీ వేదికగా వైసీపీని నిలదీయాలని ఆయన పేర్కొన్నారు.

బెదిరించే ధోరణిలో ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తుందని ఇక అలాంటి సమయంలో అటువంటి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం అవసరమని చంద్రబాబు నాయుడు అన్నారు . అసెంబ్లీ సమావేశాలకు ముందు కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు టిడిపి కార్యకర్తలపైన దాడులు పెరుగుతున్నాయని, బెదిరింపులు ఎక్కువవుతున్నాయని అందుకే వైసిపికి ఆరునెలల సమయం ఇవ్వడం అనవసరం అని పేర్కొన్నారు.

కేసీఆర్ కు మొదలైన టార్చర్ .. ఏపీని చూసైనా కళ్ళు తెరువు... కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

అణచివేత ధోరణిలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీద్దాం అని దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు

అణచివేత ధోరణిలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీద్దాం అని దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు

టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, అణచివేత ధోరణి లో ప్రస్తుతం పాలక ప్రభుత్వం పని చేస్తుందని కనుక ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టిడిపి కార్యకర్తలపై దాడులు సహించబోమని స్పష్టం చేసిన చంద్రబాబు సంఘీభావ ర్యాలీలతో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని, ధైర్యం ఇవ్వాలని సూచించారు. ఇక అలాగే శాసనమండలిలో పార్టీకి బలం బాగానే ఉందని, ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని ఆయన తెలిపారు. టిడిపి నేతల పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ధీటుగా సమాధానం చెప్పాలని, అందరూ ధీటుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.

 ప్రభుత్వ నిర్ణయాలపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి అంటూ నాయకులకు చెప్పిన బాబు

ప్రభుత్వ నిర్ణయాలపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి అంటూ నాయకులకు చెప్పిన బాబు

ఇక ప్రభుత్వం జారీచేసే అన్ని జీవోలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలంటూ చంద్రబాబు చెప్పారు. టిడిపి నేతలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు ఇక నుంచి అసెంబ్లీ వేదికగా నిలదీస్తాం అంటూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు. తమపై అనేక అంశాల్లో దాడి చెయ్యాలని పలు నిర్ణయాలు తీసుకున్న అధికార పార్టీ చేసే

ఆరోపణలను సైతం తిప్పికొట్టాలని భావిస్తున్న చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటున్నారు. అధికార వైసీపీని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam president N Chandrababu Naidu Tuesday said his party would not adopt a'wait and watch' policy towards YSR Congress government in Andhra Pradesh in view of the growing attacks on TDP workers."We initially wanted to give the new government of YS Jaganmohan Reddy six months time. But we can't remain silent now when our party workers are being threatened and attacked ever since the election results," Naidu said.A release said he made these remarks while addressing TDP members of the Andhra Pradesh Legislative Council at the government-owned Praja Vedika here this evening. Naidu alleged that the YSRC was acting with the objective of (physically) attacking TDP workers on the one hand and indugling in mud slinging on the leaders on the other. He referred to the alleged attacks on TDP workers in Anantapuramu, Prakasam, Guntur and East Godavari districts in the last 15 days and strongly condemned them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more