వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యన్న మళ్లీ.. కుంభకోణంపై ఆసక్తికరం.. ఎవరిని విడిచిపెట్టవద్దని!

అదే సమయంలో ప్రతిపక్షం వైసీపీ తీరును అయ్యన్న తప్పుపట్టారు. ఓవైపు విచారణ జరుగుతుంటే మరోవైపు వైసీపీ ధర్నాకు దిగడం సరికాదన్నారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ భూఆక్రమణలకు సంబంధించి మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలు.. సొంత పార్టీ నేతలనే ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అయ్యన్న వ్యాఖ్యల తర్వాత మరో మంత్రి గంటా ఏకంగా సీఎంకు లేఖ రాయడంతో.. ఈ విభేదాలు బయటపడ్డాయి.

అయితే తమ మధ్య విభేదాలేవి లేవని పైకి చెబుతున్నప్పటికీ.. అంతర్గతంగా వీరి మధ్య విభేదాలు రగులుతున్నట్లు ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ భూకుంభకోణంలో ఏ పార్టీ నేత పట్టుబడినా శిక్షించాల్సిందేనని పేర్కొన్నారు. కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న 'సిట్'కు ప్రజలు వాస్తవాలు చెప్పాలని సూచించారు.

<strong> మనుషులా? పశువులా?: భూదందాపై కడిగేసిన అయ్యన్న!, కంగు తిన్న మంత్రులు..</strong> మనుషులా? పశువులా?: భూదందాపై కడిగేసిన అయ్యన్న!, కంగు తిన్న మంత్రులు..

nobody will escape in vizag land scam says ayyannapatrudu

అదే సమయంలో ప్రతిపక్షం వైసీపీ తీరును అయ్యన్న తప్పుపట్టారు. ఓవైపు విచారణ జరుగుతుంటే మరోవైపు వైసీపీ ధర్నాకు దిగడం సరికాదన్నారు. విచారణలో ప్రజలకు న్యాయం జరగకపోతే.. అప్పుడు ధర్నాకు దిగాలని సూచించారు. కుంభకోణాన్ని నీరుగార్చే ఉద్దేశమే గనుక ఉంటే.. సిట్‌తో ప్రభుత్వం ఎందుకు విచారణ చేయిస్తుందని ప్రశ్నించారు.

విశాఖ భూఆక్రమణల వ్యవహారంలో తొలినుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్న అయ్యన్న.. సొంతగూటి నేతలకే టార్గెట్ అయ్యారు. కుంభకోణంలో ఏ పార్టీ నేత పట్టుబడినా శిక్షించాల్సిందేనంటూ తాజాగా అయ్యన్న చేసిన వ్యాఖ్యలు మరోసారి సొంత పార్టీ నేతలకే ఆయనపై అనుమానాలు కలిగించేవిగా మారాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary
nobody will escape in vizag land scam says ayyannapatrudu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X