వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ బ‌రిలో 3989 మంది: లోక్‌స‌భ కోసం 596 మంది అభ్య‌ర్దులు: ముగిసిన నామినేష‌న్ల ప్ర‌క్రియ‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Elections 2019 : లోక్‌స‌భ బ‌రిలో కొత్త అభ్య‌ర్దులు వీరే ! | Oneindia Telugu

సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరులో ఒక కీల‌క ఘ‌ట్టం ముగిసింది. సోమ‌వారం తో నామినేష‌న్ల గ‌డువు పూర్త‌యింది. ఎన్నిక‌ల సంఘం నుండి అందుతున్న స‌మాచారం మేర‌కు అసెంబ్లీ బ‌రిలో దాదాపు నాలుగు వేల మంది నామినేష‌న్లు దాఖలు చేసారు. లోక‌సభ కోసం సుమారు 600 మంది పోటీ ప‌డుతున్నారు.

అసెంబ్లీ బ‌రిలో 3989 మంది..

అసెంబ్లీ బ‌రిలో 3989 మంది..

ఏపి అసెంబ్లీ కోసం మొత్తం 175 సీట్ల‌కు గాను ఎన్నిక‌ల సంఘం ఇస్తున్న తాజా స‌మాచారం మేర‌కు 3989 మంది అభ్య ర్దులు నామినేష‌న్లు దాఖ‌లు చేసారు. అత్య‌ధికంగా తూర్పు గోదావ‌రి జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. విజ‌య‌న‌గ‌రం లో 9 స్థానాలు..క‌డ‌ప‌, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ప‌ది స్థానాల చొప్పున ఉన్నాయి. అయితే ఎన్నిక‌ల సంఘం నుండి వ‌స్తు న్న లెక్క‌ల ప్ర‌కారం మంగ‌ళ‌గిరి అసెంబ్లీ సీటు కోసం ఎక్క‌వ మంది బ‌రిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిర్ణీత గ‌డువు ముగిసి నా..నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు అభ్య‌ర్దులు ఎక్కువ సంఖ్య‌లో వ‌చ్చారు. వారికి టోక‌న్లు ఇచ్చి నామినేష‌న్లు సీరి య‌ల్ లో స్వీక‌రించారు. ఇక‌, అసెంబ్లీ బ‌రిలో ఉన్న ప్ర‌ముఖుల అఫిడ‌విట్‌ల‌ను ఎన్నిక‌ల సంఘం వెబ్‌సైట్ లో అప్ లోడ్ చేసింది. అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు స్క్రూటినీ..విత్ డ్రా ఘ‌ట్టం మ‌రిం త కీల‌కం కానుంది.

లోక్‌స‌భ బ‌రిలో 596 మంది...!

లోక్‌స‌భ బ‌రిలో 596 మంది...!

నామినేషన్ల దాఖ‌లు గ‌డువు ముగిసే స‌మ‌యానికి ఎన్నిక‌ల సంఘం ఇస్తున్న స‌మాచారం మేర‌కు ఏపిలో మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల‌కు దాదాపు 596 మంది అభ్య‌ర్దులు బ‌రిలో ఉన్నారు. ఏపిలోని తూర్పు గోదావ‌రి..గుంటూరు జిల్లాలో మూడు చొప్పున లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. తిరుప‌తి, చిత్తూరు, బాప‌ట్ల‌, అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాలు ఎస్సీ రిజ‌ర్వ్ కాగా, అర‌కు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ఎస్టీ రిజ‌ర్వ్ గా ఉంది. ఈ సారి టిడిపి తో పాటుగా వైసిపి , జ‌న‌సే నుండి అనేక మంది కొత్త అభ్య‌ర్దులు లోక్‌స‌భ బ‌రిలోకి దిగారు. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయ‌ణ‌.. ప‌వ‌న్ క‌ళ్యాన్ సోద‌రుడు నాగ‌బాబు, లోకేష్ తోడ‌ల్లుడు భ‌ర‌త్ కొత్త‌గా లోక్‌స‌భ అభ్య‌ర్దులుగా పోటీ ప‌డుతున్నారు. ఇక, ఎన్నిక‌ల సంఘం విడుద ల చేసిన ఓట‌ర్ల జాబితాలో విశాఖ లోక్‌స‌భ ప‌రిధిలో ఓట‌ర్ల సంఖ్య ఎక్కువ‌గా ఉంది.

ఈయన యాక్టర్.. ఆయన డైరెక్టర్: దర్శకుడు చెప్పిందే చేస్తున్నారు: పవన్ పై ఘాటు విమర్శలుఈయన యాక్టర్.. ఆయన డైరెక్టర్: దర్శకుడు చెప్పిందే చేస్తున్నారు: పవన్ పై ఘాటు విమర్శలు

స్క్రూటీనీ..విత్ డ్రా..

స్క్రూటీనీ..విత్ డ్రా..

ఎన్నిక‌ల ప్ర‌క్రియ లో మ‌రో కీల‌క ఘ‌ట్టం నామినేష‌న్ల ప‌రిశీల‌న‌. సాంకేతిక కార‌ణాల‌తో నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణ‌కు గురైన సంద‌ర్బాలు 2009 ఎన్నిక‌ల స‌మ‌యం లో ఉండ‌టం..నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో చివ‌రి నిమిషంలో జ‌రిగిన గంద‌ర‌గోళం ఇప్పుడు అభ్య‌ర్దులు గుర్తు చేసుకుంటున్నారు. దీంతో..అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో డ‌మ్మీ అభ్య‌ర్దుల‌ను రంగం లోకి దించారు. ఇక‌, ఈ రోజు నామినేష‌న్ల ప‌రిశీల‌న కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశీలకులు కూడా పాల్గొంటారు . నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని వీడియో రికార్డింగ్‌ చేస్తామన్నారు. నామినేషన్ల ఉపసంహ రణకు గురువారం వరకు గడువుందని తెలిపారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరుగుతుంది. మే 23న ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలు ప్రకటిస్తారు.

English summary
In Ap elections at closing time of nomination for 175 assembly seats 3989 nominations filed. At the same time 596 nomination filed for 25 loksabha seats. To day namination scrutiny will be conduct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X