వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నామినేషన్ లో నో క్యాస్ట్ ఎఫెక్ట్ : పవన్ ఆదర్శంగా నిలుస్తాడా ... ? అనర్హుడిగా మిగిలిపోతాడా .. ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : ప‌వ‌న్ క‌ళ్యాన్ నామినేషన్ లో నో క్యాస్ట్ ఎఫెక్ట్ | Oneindia Telugu

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న నామినేష‌న్ తో కొత్త ఒర‌వ‌డి సృష్టించారు. నామినేష‌న్ పూర్తి చేయటం లో ప్ర‌తీ అంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, తొలి సారి ఒకే సారి రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుండి బ‌రిలో దిగుతున్న ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న నామినేష‌న్ లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఒక ర‌కంగా ఆద‌ర్శంగా ఉండే ప్ర‌య‌త్నం చేసారు. ఇప్పుడు ఇది ఎన్నిక‌ల సంఘం ప‌రిశీల‌న‌లో ఉంది. అయితే, ప‌వ‌న్ తీసుకున్న ఆ నిర్ణ‌యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప‌వ‌న్‌ నిర్ణ‌యం ఆద‌ర్శ‌మే..కానీ

ప‌వ‌న్‌ నిర్ణ‌యం ఆద‌ర్శ‌మే..కానీ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి సారిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. ఒకే సారి రెండు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గా ల నుండి పోటీ చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు స్థానాల నుండి నామినేష‌న్లు దాఖ‌లు చేసారు. అయితే, ప్ర‌స్తుత నాయ‌కు ల కంటే భిన్నంగా..ఆద‌ర్శంగా నామినేషన్ లో వివ‌రాలు పొందు పరిచారు. ప‌వ‌న్ త‌న‌కు కులం ఆపాదించ‌వ‌ద్ద‌ని .. కులాల‌ను ఐక్య‌త చేయ‌ట‌మే త‌న రాజ‌కీయ‌మ‌ని ప‌లు సార్లు చెబుతూ వ‌చ్చారు. ఇప్పుడు నామినేష‌న్ దాఖ‌లు సం ద‌ర్భంలోనూ ఈ విష‌యాన్ని ఆచ‌ర‌ణ లో చూపించారు. నామినేష‌న్ లో సాధార‌ణంగా ఎన్నిక‌ల సంఘం కోరిన పూర్తి స‌మాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా..నామినేష‌న్ లో అభ్య‌ర్ది వ్య‌క్తి గ‌త అంశాల‌కు చెందిన కాల‌మ్ లో ఏ కుల‌మో నింపాల్సి ఉంటుంది. అయితే, అక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆమ‌త్రం ఏ కుల‌మో నింపాల్సిన ఖాళీలో ‘నాట్ అప్లికబుల్' అని రాసారు. తాను ఏ కులానికి చెందిన వాడిని కాద‌ని చెప్ప‌ట‌మే అక్క‌డ ప‌వ‌న్ ఉద్దేశంగా క‌నిపిస్తోంది. అయితే, నామినేష‌న్ లో ఈ ర‌కంగా రాయ‌టం ద్వారా ఇప్పుడు ప‌వ‌న్ నామినేష‌న్ వ్య‌వ‌హారం ఆస‌క్తి క‌రంగా మారింది.

ప‌వ‌న్ దారిలోనే మాజీ జేడీ..

ప‌వ‌న్ దారిలోనే మాజీ జేడీ..

ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్ నామినేష‌న్ పూర్తి చేసే స‌మ‌యంలో ఆద‌ర్శంగా ఉండాల‌నే ఉద్దేశం తో ఏర‌కంగా వ్య‌వ‌హ‌రించారో ఆయ‌న పార్టీ నుండి విశాఖ ఎంపి అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్న మాజీ జేడీ లక్ష్మీనారాయ‌ణ అదే విధంగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న సైతం త‌న నామినేష‌న్ లో కుల ప్ర‌స్తావ‌న వ‌ద్ద నాట్ అప్లిక‌బుల్ అని రాసిన‌ట్లు స‌మాచారం. ఇదే విధంగా పార్టీలో ప‌వ‌న్ తో స‌న్నిహితంగా ఉంటూ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన మ‌రి కొంత మంది నేత‌లు సైతం ఇదే ర‌కంగా త‌మ నామినేష‌న్ల దాఖ‌లు స‌మ‌యంలో వ్య‌వ‌హ‌రించిన‌ట్లు పార్టీ నేత‌లు చెబుతున్నారు. తాము చెబుతుంది..ఆచ‌ర‌ణ లో చేసి చూపించాల‌నే లక్ష్యంతోనే తొలి నామినేష‌న్ల నుండే త‌మ విధానం స్ప‌ష్టం చేస్తున్నామ‌ని చెబుతున్నారు.

విశాఖ‌లో జేడీ..! పెరిగింది రాజ‌కీయ వేడి..!!ఎవ‌రికి చిక్కుతుందో ఓట‌ర్ల నాడి..!!విశాఖ‌లో జేడీ..! పెరిగింది రాజ‌కీయ వేడి..!!ఎవ‌రికి చిక్కుతుందో ఓట‌ర్ల నాడి..!!

తిర‌స్క‌రించినా.. ఎవ‌రి పేరు లేదు..

తిర‌స్క‌రించినా.. ఎవ‌రి పేరు లేదు..

అభ్య‌ర్దుల నామినేష‌న్ దాఖ‌లు చేసే స‌మయంలో నామినేష‌న్ లోనే ఒక వేళ అభ్య‌ర్ది నామినేష‌న్ సాంకేతిక కారణాల‌తో తిర‌స్క‌రిస్తే.. త‌న‌కు బ‌దులుగా బ‌రిలో ఉండాల్సిన వ్య‌క్తి పేరును సూచిస్తారు.అయితే, వ‌ప‌న్ క‌ళ్యాన్‌, మాజీ జేడి మా త్రం త‌మ నామినేష‌న్ల లో ఆ విధంగా సూచించ‌లేద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాన్‌..మాజీ జేడి ఇద్ద‌రూ త‌మ నామినేష‌న్ల విష‌యంలో పూర్తి అప్ర‌మ‌త్తంగానే వ్య‌వ‌హ‌రిస్తూ..ఆద‌ర్శ‌కంగా ఉన్నామ‌నే విధంగా వ్య‌వ‌హ‌రించార‌ని..వారి నామినేష‌న్ల లో ఎటువంటి ఇబ్బందులు రావ‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే, ఇలా నామినేష‌న్ల విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ తీసుకున్న నిర్ణ‌యం మాత్రం ఇప్పుడు ఏపి ఎన్నిక‌ల స‌మ‌యాన హాట్ టాపిక్ గా మారింది.

English summary
Pawan Klayan new trend ini filing election nominations. Pawan mentioned not applicable against caste column in Nomination. Ex JD also followed in this matter. Now this issue became hot topic in AP elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X