జగన్ చాటుకు వెళ్లి ప్రేమించాలి -హీరో మహేశ్‌బాబు ఫీలింగా? -పెయిడ్ గుట్టురట్టు: ఎంపీ రఘురామ
ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అరాచకత్వం విపరీతంగా పెరిగిపోయిందని, సినిమాలు చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనంపై ఫైన్లు బాదుతున్నారని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి బహిరంగ వేదికపై అన్నా అని సంబోధించడం ఆక్షేపనీయమన్నారు. అమరావతిలో ఉద్యమ ప్రభంజనం చూసి ప్రభుత్వం, పోలీసులే పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారని విమర్శించారు. 'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎంపీ ఏమన్నారంటే...
100ఏళ్ల తర్వాత ఏపీలో భూసర్వే -1.22లక్షల చ.కిమీ, 4500 టీమ్స్ - సీఎం జగన్ రివ్యూ -దేశంలో తొలిసారి

పెయిడ్ గుట్టు రట్టు..
‘‘అమరావతి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధానికి భూములిచ్చి దగాపడ్డ వేలాది మంది రైతులు భారీ ర్యాలీలను అద్భుతంగా తీశారు. అమరావతిలో అసలు ఉద్యమమే లేదన్న పనికిమాలిన వెధవలకు కనువిప్పు కలిగిలా వేల మంది పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి సభలకు అనుమతి తీసుకుని పెద్ద పెట్టున గళం వినిపించారు. అయితే, సాయంత్రానికి మళ్లీ అదే అమరావతిలో మూడు రాజధానులు కావాలంటూ కొందరు పెయిడ్ ఆర్టిస్టులు హడావుడి సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ ఆ గుట్టు మొత్తం రట్టయిపోయింది. వైసీపీ ప్రజాప్రతినిధులే.. దగ్గరుండి ఆటోలు పెట్టి, ఆర్టిస్టులను తరలించారు. మనిషికి వెయ్యి రూపాయలిచ్చి నినాదాలు చేయించిన ఫొటోలు బయటికొచ్చాయి. పెయిడ్ ఆర్టిస్టులు వస్తున్నారనే సాకు చూపించిన పోలీసులు.. అసలైన ఉద్యమకారులను వెళ్లగొట్టారు. అంతేకాదు..
జగన్ తప్పు దిద్దుకున్నారు- జస్టిస్ రమణ అంశంలో చెంపపెట్టులా ఆమె - మోదీదే బాధ్యత: ఎంపీ రఘురామ

ప్రేమ ఉంటే చాటుకు వెళ్లండి..
పోలీసులు తమ కంట్రోల్ లో ఉన్నారుకదాని వైసీపీ నేతలు ఇలా చేయడం భావ్యంకాదు. అదీకాకుండా, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి సీఎం జగన్ బహిరంగ వేదికపై ‘సవాంగన్నా..''అని అనడం ఏమాత్రం సరికాదు. పోలీసులకు, మీకు అంత ప్రేమ ఉంటే.. చాటుకు వెళ్లి ప్రేమించుకోండి. అంతేగానీ, బహిరంగ వేదికలపై పదవుల స్థాయి తగ్గేలా మాట్లాడకండి. అసలే ఏపీలో తీవ్రమైన పోలీసుల జులం ఎదుర్కొంటున్న ప్రజలు ఇకపై రాజకీయ నేతలు అందరినీ అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. అంతేకాదు..

జగన్ అనే నేను..
ముఖ్యమంత్రి జగన్ బహుశా ‘భరత్ అనే నును' సినిమా చూసినట్లున్నారు. సినిమాలో హీరో మహేశ్ బాబు చేసినదాన్ని ఫాలో అవుతూ, ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్ తెచ్చారు. భారీగా ఫైన్లు వేస్తున్నారు. సెల్ ఫోన్ మాట్లాడితే రూ.10వేలు, లారీలు కాటాకు రాకుంటే రూ.40వేలు వసూలు చేస్తున్నారు. ఖజానా కోసమే పోలీసులు ఈరకమైన వసూళ్లకు పాల్పడుతున్నారు. జనం నుంచి జీతాలు తీసుకుంటూ, తిరిగి ప్రజలపైనే పోలీసులు జులుం చేస్తున్నారు. వాహనాలు నడిపేవాళ్లకు అన్ని పేపర్లూ ఉన్నా, ప్రజల ప్రవర్తన బాగోకపోతే ఫైన్లు వేసే నిబంధనలు ఉన్నాయి. ‘జగన్ అనే నేను' మోడల్ దాష్టీకాలు ఎంత దారుణంగా ఉంటాయో రాబోయేరోజుల్లో మనం చూడబోతున్నాం.

పవర్స్ అన్నీ సవాంగన్న చేతికా?
రాష్ట్రంలో అసలు రోడ్లు వేయకుండా, కనీసం గుంతలు పూడ్చకుండా వాహనాల నుంచి పన్నులు, ఫైన్లు వసూలు చేస్తుండటాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సరైన రోడ్లు లేకపోతే ప్రజలే ప్రభుత్వానికి పెనాల్టీ వేయొచ్చా? అని అడుగుతున్నారు. సినిమాలు చూసి ప్రభావితమై వాటిని ఇలా అమలు చేయడం కరెక్ట్ కాదు. ప్రాక్టికల్ గా పోలీసులతో ఇబ్బందుల్ని జనం ఫేస్ చేస్తున్నారు. జనం వెతలను ఇంకా పెంచడం సరికాదు. పవర్స్ అన్నీ జగన్ తన సవాంగ్ అన్నయ్యకు ఇచ్చేస్తే మరిన్ని దారుణాలు జరిగిపోతాయి'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.