వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులను వేధించొద్దు, కౌలు చెల్లించడంలో జాప్యమొద్దు, ప్రభుత్వాన్ని కోరిన జనసేనాని పవన్ కల్యాణ్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రబలి.. ఆపత్కాలంలో ఉన్న రైతులను వేధించడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. ఆ చర్యలను వెంటనే ప్రభుత్వం నిలిపివేయాలని కోరారు. భూమి లేని పేదలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని పవన్ కల్యాణ్ కోరారు.

 ఆ ఘనత ఎవరి ఖాతాలో: తాను చేసిన ట్వీట్ వల్లేనంటోన్న పవన్ కల్యాణ్: కిషన్ రెడ్డి ఏం చెబుతున్నారు? ఆ ఘనత ఎవరి ఖాతాలో: తాను చేసిన ట్వీట్ వల్లేనంటోన్న పవన్ కల్యాణ్: కిషన్ రెడ్డి ఏం చెబుతున్నారు?

లాక్ డౌన్ వల్ల రైతులకు అనేక సందేహాలు వస్తున్నాయని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించే సమయం వచ్చిందని తెలిపారు. కానీ కరోనా వైరస్ వల్ల కౌలు ఇస్తారా లేరోననే ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రైతుల కౌలు చెల్లింపుల విషయంలో జాప్యం లేకుండా ఉండాలన్నారు. వారికి అందజేసే కనీస కౌలును కూడా ఆలస్యం చేస్తే వారి జీవనం దుర్భరం అవుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

not delay farmers land lease, pawan kalyan asks ap govt

రాష్ట్రంలో పెన్షన్లు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. సకాలంలో అందజేస్తే వారికి ప్రయోజనం కులుగుతుందని చెప్పారు. లేదంటే వారు కనీస అవసరాలను కూడా తీర్చుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుచేశారు. పెన్షన్లలో కోత లేకుండా చూస్తోన్న ప్రభుత్వం.. సమయానికి ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

Recommended Video

AP Govt Extends Contract Employees Tenure For 2 Months | 60 వేల ఉద్యోగులకు ప్రయోజనం

English summary
not delay farmers land lease..janasena chief pawan kalyan asks andhra pradesh government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X