వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోటుకు ఓటుపై రాజ్‌నాథ్‌తో మాట్లాడలేదు: సుజనా, తిప్పికొడ్తామని సోమిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ‌/ హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో నోటుకు ఓటు కేసుపై గానీ, ఎపి పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 గురించి గానీ చర్చించలేదని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి చెప్పారు. ఆయన గురువారంనాడు రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్‌శాఖ ఆధునీకరణకు రూ. 500 కోట్లు, గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌కు నిధుల అంశంపై భేటీలో చర్చించినట్టు భేటీ అనంతరం ఆయన మీడియాతో చెప్పారు.

Not discussed about cash for vote case: sujana Chowdhari

ఉమ్మడి రాజధానిలో ఏపీ ప్రజలు, ప్రభుత్వ పెద్దలకు జరుగుతున్న అవమానాన్ని తిప్పి కొడతామని గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని బీద రవిచంద్ర అన్నారు. నిరంతరం పార్టీ ఉన్నత కోసం పనిచేస్తామని ఎమ్మెల్సీలు జనార్థన్‌, శ్రీనివాసులు తెలిపారు.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక అయిన ఈ నలుగురు నేతలు గురువారం శాసనమండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నవాళులర్పించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ, కార్యకర్తలు, రాష్ట్రం, నాయకుడి కోసం రాజీపడకుండా, నిస్వార్థంగా పనిచేస్తామని అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలో తెలంగాణ ప్రభుత్వం పెట్టినవి తప్పుడు కేసులని ఆయన అన్నారు.

English summary
After meeting with union home minister Rajnath Singh, union minister and Telugudesam party (TDP) leader Sujana Chowdhari said that discussion on cash for vote has not been taken place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X