దానం, ముఖేష్‌ల గెలుపు ఈజీ కాదు! కొత్తగా జగన్‌పార్టీ

హైదరాబాద్: ఎన్నికలలో మాజీ మంత్రులు దానం నాగేందర్ (ఖైరతాబాద్), ముఖేష్ గౌడ్ (గోషామహల్) తమ నియోజకవర్గాలలో గట్టి పోటీ ఎదురవుతోంది. జంట నగరాల నుండి ముఖేష్, దానంలు తాజా మాజీ మంత్రులు. వారి గెలుపు ఈసారి అంత సులభం కాదని అంటున్నారు.

ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తే ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరని ముఖేష్ గౌడ్ పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఓ వర్గానికి చెందిన ఓట్లను ఎక్కువగా చీల్చే అవకాశం ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజాసింగ్ బరిలో ఉండటంతో ఆయన గెలుపు అంత సులువేమీ కాదంటున్నారు.

Not easy to win former ministers

ఈసారి గెలుపు అంత సులభం కాదని భావించిన ముఖేష్.. స్థానికంగా మంచి పట్టున్న ఓ రెబెల్ అభ్యర్థిని ఓట్లు చీల్చడానికి రంగంలో దింపినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పై చిలుకు ఓటర్లుండగా, దాదాపు పావు వంతు ఉన్న మైనార్టీ ఓట్లే కీలకంగా మారుతూ వస్తున్నాయి.

అయితే, మైనార్టీ ఓట్లు తనకేనని, అంతేకాకుండా తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ముఖేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు దానం నాగేందర్ పరిస్థితి కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉందంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉండటంతో నాగేందర్ కూడా కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+