వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానభంగం కామెంట్స్: లోకేశ్ కాదు వైసీపీ క్యాడర్ నిజంగా చేసినా, గాంధారిలా , సుచరితపై టీడీపీ అనిత..

|
Google Oneindia TeluguNews

ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్‌కి చేరింది. ఏపీ సర్కార్ ఫోన్లను ట్యాప్ చేస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాయడంతో తేనేతుట్ట కదిలింది. దీనికి డీజీపీ రియాక్టవడం.. టీడీపీ నేతల కౌంటర్లు కొనసాగుతోన్నాయి. అయితే నారా లోకేశ్ మానభంగం చేశారని ఆరోపణలు చేస్తే ఊరుకుంటారాఅని హోం మంత్రి సుచరిత కామెంట్ చేయడంతో టీడీపీ మహిళా నేత అనిత స్పందించారు.

ఫోన్ ట్యాపింగ్‌పై సమాధానం చెప్పండి..

ఫోన్ ట్యాపింగ్‌పై సమాధానం చెప్పాలని సుచరితను అనిత కోరారు. అంతేకానీ లేని పోనీ కామెంట్లు చేయడం ఎందుకు అని ట్వీట్ చేశారు. లోకేశ్‌పై కామెంట్స్ చేసే ముందు ఆలోచిస్తే బాగుండేదని హితవు పలికారు. అంతేకాదు టీడీపీ ప్రతినిధులపై ఆరోపణలే.. కానీ మీ వైసీపీ నేతలు ఏం చేసినా చర్యలు తీసుకోరు కదా అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అనిత కౌంటర్‌తో అధికార వైసీపీ డిఫెన్స్‌లో పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మీ క్యాడర్ మానభంగాలు చేసిన చర్యలు లేవు..?

మీ క్యాడర్ మానభంగాలు చేసిన చర్యలు లేవు..?

మీ వాలంటీర్స్, వైసీపీ క్యాడర్ మానభంగాలు చేసినా చర్యలేవి అని అనిత ప్రశ్నించారు. మీరు గాంధారిలా కళ్లకు గంతలు కట్టుకొని చూస్తున్నారే తప్ప హోంమంత్రిగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కానీ లోకేశ్‌పై మాత్రం మానభంగం ఆరోపణలు అంటూ.. కామెంట్స్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈ కామెంట్స్ ఊహించిందే.. ఇందులో షాకింగ్ ఏమీ లేదు అని అనిత దుయ్యబట్టారు. అంతేకాదు షేమ్@సుచరిత వైఎస్ఆర్‌సీపీ అని ట్యాగ్ కూడా పోస్ట్ చేశారు.

చంద్రబాబు లేఖకు సుచరిత కౌంటర్..

చంద్రబాబు లేఖకు సుచరిత కౌంటర్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంని ప్రధాని మోదీకి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై హోం మంత్రి సుచరిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని, నారా లోకేశ్ మానభంగం చేశారని తాము ఆరోపిస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

బురదచల్లడం సరికాదు, తీరు మార్చుకోవాలి

బురదచల్లడం సరికాదు, తీరు మార్చుకోవాలి

ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వైసీపీ సర్కారుపై బురద చల్లడానికే చంద్రబాబు అండ్ కో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వానికి ప్రజాదరణ పెరగకుండా చేస్తున్న కుట్రల్లో భాగంగానే ట్యాపింగ్ డ్రామా ఆడుతున్నారని హోం మంత్రి విమర్శించారు. దేశంలోనే అత్యుత్తమ మూడో ముఖ్యమంత్రి అని జగన్ కు పేరు రావడాన్ని చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని సుచరిత అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీ మనీలాండరింగ్ వ్యవహారం బయటకు వస్తుందని భయపడుతున్నారా? అని ఎద్దేవా చేశారు.

English summary
not tdp leader nara lokesh, ycp cadre do rapes in andhra pradesh state. tdp anitha asked home minister sucharita.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X