వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కాదు.. నారా రమేశ్, నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: విజయసాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కాదు అని నారా రమేశ్ కుమార్ అని విమర్శించారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు అని.. రాజ్యాంగబద్దమైన పదవీలో ఉంటూ నిమ్మగడ్డ ప్రసాద్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టను ఆశ్రయిస్తామని కూడా పేర్కొన్నారు.

కనకపు సింహాసంపై శునకాన్ని కూర్చొబెడితే ఏం జరుగుతోంది... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ప్రసాద్‌ను నియమించడంతో అదే జరిగిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. నిమ్మగడ్డ రమేశ్ చర్య అప్రజాస్వామికమని.. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈసీ చేసిన చర్యను సుప్రీంకోర్టే తేలుస్తుందని చెప్పారు.

not nimmagadda ramesh.. nara ramesh vijaya sai reddy alleged

అసెంబ్లీ, పార్లమెంట్‌కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుందని.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విచక్షణాధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. కానీ రమేశ్ తనకు లభించిన స్వేచ్ఛ. రాజ్యాంగబద్ద అధికారాలను దుర్వినియోగం చేశారని విజయసాయిరెడ్డి ఫైరయ్యారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వాయిదావేయడంతో వివాదం రాజుకుంది. వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించారు. అధికార పార్టీ నేతలు రమేశ్ కుమార్.. చంద్రబాబు చెప్పినట్టు నడుచుకొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. వైరస్ ప్రబలుతుంటే ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు.. అధికార వైసీపీ నేతల తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు.

English summary
ycp leader vijaya sai reddy angry on ec ramesh kumar. he is not nimmagadda ramesh.. nara ramesh alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X