వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదిలో ఒక్క ఆలయం కూడా పున:నిర్మించలేదు, వైరస్ వ్యాప్తికి మంత్రే కారణం: జనసేన

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన విమర్శలు గుప్పించింది. అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోన్న.. కూల్చిన ఆలయాలు ఎందుకు పున:నిర్మించలేదని ప్రశ్నించింది. ఆలయాలు నిర్మించాలని ధర్నా చేస్తే.. నిర్మిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు తప్పుతారా అని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రశ్నించారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై విమర్శలు గుప్పించారు.

జనసేన స్కెచ్..ఒక దెబ్బకు రెండు పిట్టలు: టీడీపీకి దూరంగా: ప్యాకేజీ విమర్శలకు బ్రేక్ పడేలాజనసేన స్కెచ్..ఒక దెబ్బకు రెండు పిట్టలు: టీడీపీకి దూరంగా: ప్యాకేజీ విమర్శలకు బ్రేక్ పడేలా

తమతో ఆందోళన చేసిన శివస్వామిని వెల్లంపల్లి తిప్పుకున్నారని ఆరోపించారు. శివస్వామి తీరు చూస్తుంటే.. వైసీపీ సభ్యత్వం తీసుకున్నట్టు అనుమానం వస్తోందని తెలిపారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచం వణికిపోతుంటే.. మంత్రి వెల్లంపల్లికి మాత్రం కాసుల పంట కురిపించిందని విమర్శలు చేశారు. తన అనుయాయులతో కలిసి రాజకీయం చేశారని మండిపడ్డారు.

not reconstruct one temple in a year: janasena

Recommended Video

Strawberry Full Moon Lunar Eclipse On June 5th, How & When To Watch Tonight

అయితే కొందరు వైసీపీ నేతలకు కరోనా పాజిటివ్ వచ్చిందని గుర్తుచేశారు. వారిని క్వారంటైన్‌కు పంపించకుండా అడ్డుకున్నారని మహేశ్ తెలిపారు. మంత్రి పదవీలో ఉండి, నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. దీంతో పశ్చిమ నియోజకవర్గంలో కరోనా వైరస్ కేసులు పెరిగాయని గుర్తుచేశారు. కొందరు అభాగ్యులు చనిపోయారని.. ఇందుకు మంత్రి వెల్లంపల్లి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో అధికారులు కూడా ఒత్తిడికి తలొగ్గొద్దని.. నిబంధనల మేరకు నడచుకోవాలని సూచించారు. కలెక్టర్, పోలీసు కమిషనర్ సదరు నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
not reconstruct one temple in a year andhra pradesh janasena spokes person mahesh said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X