వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరకట్టపై నిర్మించిన అన్ని కట్టడాలకు నోటీసులు ఇస్తాము....బోత్స

|
Google Oneindia TeluguNews

క్రిష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటికి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు మంత్రి బోత్స సత్యనారయణ అన్నారు..తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి నోటీసులు ఇవ్వడంపై లోకేష్‌తోపాటు యనమల రామక్రిష్ణుడు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు...ఈనేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇళ్లు స్వంతం కాదని అది లింగమనేని రమేశ్‌దనిచెప్పిన ఆయన అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధన ఉందని ఆయన తెలిపారు.

ఈ నేపధ్యంలోనే తమకు ఎవరిపైన కక్షపూరితంగా వ్యవహారించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తమకు చంద్రబాబు అయినా ,సామాన్య ప్రజలైన ఒక్కటేనని అన్నారు.. ఇక యనమల రామక్రిష్ణుడు చెప్పింది వినడానికి ఆయన ఎమైన భగద్గీతా చెప్పారా అంటూ ఆయన ప్రశ్నించారు..కాగా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం సీఆర్డీఏ పరిధిలో లేదని చెప్పడానికి యనమల రామకృష్ణుడు ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.

Notices will be issued to all illegal structures built on the Krishna river

మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో కోట్ల రుపాయాల నష్టం జరిగిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలన్ని చంద్రబాబు ,లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయని అన్నారు. కాగ వైఎస్ హాయాంలో విద్యుత్ రెట్లను ఒక్కపైసా కూడ పెంచలేదని చెప్పిన బోత్స గత అయిదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎంత విద్యుత్‌ను ఉత్పత్తి చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎవెరెన్ని ఇబ్బందులకు గురి చేసినా తమ పని తాము చేసుకుని వెళతామని అన్నారు.

English summary
Notices will be issued to all illegal structures built on the Krishna river basin, Minister Botsa Satyanarayana said.He responded to the comments of Lokesh and Yanamala Ramakrishna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X