వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకల్ హీట్: ఉత్కంఠతకు వీడటానికి మరో 24 గంటలు: రిజర్వేషన్లపై కసరత్తు.. తెలంగాణ నుంచి భారీగా.. !

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో అందరి దృష్టీ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలపైనే నిలిచాయి. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడొస్తుంది? రిజర్వేషన్ల సంగతేంటీ? దళితలు, బడుగు బలహీన వర్గాలకు ఏఏ స్థానాలకు కేటాయిస్తారు? అనే ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు జనం. ఈ ఉత్కంఠత వీడాలంలో మరో 24 గంటల పాటు వేచి చూడక తప్పదు. ఎన్నికల నోటిఫికేషన్ శనివారం నాడు విడుదల కాబోతోంది.

 రిజర్వేషన్ల వల్లే జాప్యం..

రిజర్వేషన్ల వల్లే జాప్యం..

నిజానికి- శుక్రవారం నాడే నోటిఫికేషన్ వస్తుందని భావించినప్పటికీ.. అది ఒకరోజు వాయిదా పడింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం వల్లే వాయిదా పడినట్లు చెబుతున్నారు. రిజర్వేషన్లను ఖరారు చేయడంపై జిల్లా పాలనా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు లోబడి 50 శాతం మేరకే వెనుకబడిన వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్‌ను నిర్ధారించబోతోంది. రిజర్వేషన్ల ఖరారుపై మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు.

ఈ సాయంత్రం ఐదు గంటలకు రాజకీయ పార్టీల నేతలతో ఈసీ భేటీ

ఈ సాయంత్రం ఐదు గంటలకు రాజకీయ పార్టీల నేతలతో ఈసీ భేటీ

అన్ని ఎన్నికలు ఒకేసారి..జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలన్నింటికీ ఒకే దఫాలో పోలింగ్‌ను నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. మార్చి లోగా ఎన్నికలను నిర్వహించగలిగితే.. కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన 5000 కోట్ల రూపాయల నగదు మొత్తం రాష్ట్రానికి అందుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఒకేసారి ఎన్నికలను నిర్వహించగలిగితేనే..మార్చి 31లోగా స్థానిక సంస్థల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ నుంచి అదనపు పోలీసు బలగాలు

తెలంగాణ నుంచి అదనపు పోలీసు బలగాలు


ఒకేసారి ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున.. అదనపు పోలీసు బలగాలను మోహరించనుంది ప్రభుత్వం. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున అదనపు పోలీసు బలగాలను రప్పించ వచ్చని చెబుతున్నారు. దీనికోసం నోటిఫికేషన్ వెలువడిన తరువాత.. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.. స్వయంగా హైదరాబాద్‌కు వెళ్లి.. ఆ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డితో సమావేశమౌతారని చెబుతున్నారు.

Recommended Video

AP Local Body Elections To Go With 50 Percent Reservation Basis | Oneindia Telugu
కొన్ని జిల్లాల్లో ఖరారు..

కొన్ని జిల్లాల్లో ఖరారు..


ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్లు విడులయ్యాయి. రాయలసీమలోని కడప, చిత్తూరు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, ఉత్తర కోస్తాలోని తూర్పు గోదావరి, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్ల ఖరారు చేశారు. వాటన్నింటినీ క్రోడీకరించి శనివారం నాటికి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు.

English summary
Notification for Local Body elections in Andhra Pradesh will be release on Saturday. ZPTC, MPTC and Municipalities elections will be conduct in single day. 50 Percent Backward reservation will be fixed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X