వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఎన్నికల సంగ్రామం: పంచాయతీ పోరు ముగిసిన వెంటనే: నిమ్మగడ్డకు చేతినిండా పని

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నెటకొంటోన్న వేళ.. మరో రెండు రోజుల్లో నామినేషన్లను దాఖలు చేయడానికి సన్నాహాలు ముగింపు దశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో.. మరో సంగ్రామానికి తెర లేవబోతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడొచ్చని సమాచారం. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కసరత్తు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

 కీలక భేటీ: గవర్నర్‌తో నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశం: 15 నిమిషాల తేడాతో కీలక భేటీ: గవర్నర్‌తో నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశం: 15 నిమిషాల తేడాతో

ఫిబ్రవరి 22న నోటిఫికేషన్..

ఫిబ్రవరి 22న నోటిఫికేషన్..

వచ్చేనెల 22వ తేదీన మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన నోటిఫికేషన్ వెలువడుతుందని సమాచారం. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన రీషెడ్యూల్ ప్రకారం.. వచ్చే నెల 21వ తేదీన పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ముగుస్తుంది. 9వ తేదీన ఆరంభం అయ్యే పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాలుగు విడతల్లో అంటే.. 13, 17, 21 తేదీలతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజే మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్, షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేస్తారని అంటున్నారు. రెండు లేదా మూడు విడతల్లో ఈ ఎన్నికలు ముగిసేలా సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

 గత ఏడాదే పూర్తి కావాల్సి ఉన్నా..

గత ఏడాదే పూర్తి కావాల్సి ఉన్నా..


గత ఏడాది మార్చిలోనే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్పప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న కారణంగా వాటిని వాయిదా వేశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే మున్సిపాలిటీలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టి సారిస్తారని, 22వ తేదీ నాడే ఎన్నిలకను నిర్వహించే విధంగా నోటిఫికేషన్ జారీ చేస్తారని అంటున్నారు. మార్చి నెలాఖరుతో ఆయన పదవీ కాలం ముగియబోతోన్నందు.. తన హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.

75 మున్సిపాలిటీలు.. 16 కార్పొరేషన్లు..

75 మున్సిపాలిటీలు.. 16 కార్పొరేషన్లు..

రాష్ట్రంలో ప్రస్తుతం 77 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు ఉన్నాయి. 31 నగర పంచాయతీలు ఉన్నాయి. 75 మున్సిపాలిటీల్లో ఆరు సెలెక్షన్ స్పెషల్ గ్రేడ్, ఏడు స్పెషల్ గ్రేడ్, 16 ఫస్ట్ గ్రేడ్, 30 సెకెండ్ గ్రేడ్, 20 థర్డ్ గ్రేడ్ కేటగిరీకి చెందినవి. మొత్తం 104 మున్సిపాలిటీలు ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల 29 చోట్ల ఎన్నికలను నిర్వహించకపోవచ్చు. పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కారణాల వల్ల ఆయా మున్సిపాలిటీల్లో ఆలస్యంగా ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించకపోవచ్చని అంటున్నారు. ప్రభుత్వం కొత్తగా నోటిఫై చేసిన వైఎస్సార్ తాడిగడప, పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, విజయనగరం జిల్లాలోని రాజాం, చిత్తూరు జిల్లా బీ.కొత్తకోట, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా పొదిలిలను ఈ జాబితాలో చేర్చుతారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

 కార్పొరేషన్లకూ ఒకేసారి?

కార్పొరేషన్లకూ ఒకేసారి?

మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరపాలా? లేదా? అనేది ఖరారు కాలేదని తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ల కోసం ప్రత్యేకంగా ఎన్నికలను నిర్వహించడానికి మొగ్గు చూపొచ్చని సమాచారం. 16 మున్సిపాలిటీల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి ప్రత్యేకంగా మరో రోజు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే కార్పొరేషన్ల కోసం నోటిఫికేషన్ వెలువడొచ్చని చెబుతున్నారు.

Recommended Video

AP Panchayat Elections 2021 : AP Govt Announced Incentives Where Elections Held Unanimously

English summary
After Panchayat elections in Andhra Pradesh, notification for Municipal elections is likely to be release on February 22nd. There are 104 municipalities in the state, but elections will be held for 75 and the remaining are pending for similar reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X