వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ..! ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ఏపి సర్కార్..!!

|
Google Oneindia TeluguNews

అమరాతి/హైదరాబాద్ : గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. వాలంటీర్ల ఎంపికకు శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేపింది. నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరి ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ చేయడం లక్ష్యంగా గ్రామాలు, పట్టణాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజునే ప్రకటించిన విషయం విదితమే. వీరి ఎంపికకు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాల ఫైలుపై ముఖ్యమంత్రి శుక్రవారం సంతకం చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తోంది. అందులోని నిర్ణీత ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లోనే అభ్యర్థుు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌ వివరాలను ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. జూలై ఐదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామం, పట్టణ వార్డులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా వలంటీర్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. నియామకంలో రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ప్రతి కేటగిరీలోనూ సాధ్యమైనంత వరకు 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తారు. ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక జరగుతుంది..

Notification for replacement of village volunteers in ap..!

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడంతో ాటు సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలలో పని చేసి ఉండటం, చేస్తుండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు. నాయకత్వ లక్షణాలు, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండడం, తమకు కేటాయించిన పనిని నిబద్ధత, నిజాయితీతో చేయడానికి ఆసక్తి ఉండడం వంటివి అదనపు అర్హతగా పరిగణిస్తారు. బేస్‌ లైన్‌ సర్వే ఆధారంగా గ్రామం, వార్డులో ఉన్న కుటుంబాలను 50 చొప్పున ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీపీ, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీల కమిటీనే గ్రామాల వారీగా 50 ఇళ్ల గ్రూపులను కూడా వర్గీకరిస్తుంది. పట్టణాల్లో 50 ఇళ్ల గ్రూపులను మున్సిపల్‌ కమిషనర్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, మరొక సీనియర్‌ అధికారితో కూడిన కమిటీ వర్గీకరిస్తుంది. గ్రూపుల వర్గీకరణ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో 50 ఇళ్లకన్నా తక్కువ సంఖ్యలో కుటుంబాలు మిగిలిపోతే వారిని ఆ గ్రామం, వార్డులోని గ్రూపులతో సర్దుబాటు చేస్తరు. వలంటీర్ల నియామకానికి గ్రామం, మున్సిపల్‌ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్‌గా ఆ మండల పరిధిలో నియమించే వలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని, ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు.

English summary
The government is now accepting applications for appointment of village and ward volunteers. The government issued a notification on Saturday for the selection of volunteers.Receive applications online as soon as the notification is issued. Chief Minister Jagan Mohan Reddy announced on his swearing-in day that government-run welfare schemes would hire volunteers for every 50 households in villages and towns with the aim of delivering door to door for all eligible households.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X