వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రావతరణ దినోత్సవం ఎప్పుడు? తెరపై కొత్త తేదీ! నవంబర్ 1 ఖాయమా?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతణ దినోత్సవం ఎప్పుడు? అని ప్రశ్నిస్తే.. నవంబర్ 1 అనే సమాధానం వినిపించడం సహజం. ఉమ్మడి రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నాడే రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు చోటు చేసుకునేవి. రాష్ట్ర విభజన అనంతరం నిర్దేశిత ఫలానా తేదీ అనేది లేకుండా పోయింది. 2014 జూన్ 2 వ తేదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పునర్విభజించిన తరువాత రాష్ట్రావతరణ దినోత్సవం నిర్వహించలేదు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.

దాని స్థానంలో నవ నిర్మాణ దీక్ష పేరుతో వారంరోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలించిన అయిదేళ్లలో రాష్ట్రావరణ దినోత్సవాలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి రాష్ట్రావతరణ దినోత్సవం ఎప్పుడనే విషయం చర్చల్లోకి వచ్చింది. నవంబర్ 1కి బదులుగా అక్టోబర్ 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయిదేళ్ల చిన్నారి కిడ్నాప్: ట్రావెల్ బ్యాగులో కుక్కి పట్టుకెళ్లిన దుండగుడుఅయిదేళ్ల చిన్నారి కిడ్నాప్: ట్రావెల్ బ్యాగులో కుక్కి పట్టుకెళ్లిన దుండగుడు

తెలంగాణ సరే.. ఏపీ పరిస్థితేంటీ?

తెలంగాణ సరే.. ఏపీ పరిస్థితేంటీ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 10 జిల్లాలతో తెలంగాణ, 13 జిల్లాలతో ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాయి. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటోంది అక్కడి ప్రభుత్వం. మరి ఏపీ పరిస్థితేంటీ? 13 జిల్లాలతో మిగిలిన ఆంధ్రప్రదేశ్ జూన్ 2వ తేదీ నాడే రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నిర్వహించట్లేదు. రాష్ట్రాన్ని పునర్విభజించడం సీమాంధ్ర ప్రజలకు ఇష్టం లేకపోవడం వల్ల జూన్ 2వ తేదీకి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. తెలంగాణ ప్రాంతంతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నవంబర్ 1వ తేదీని కూడా రాష్ట్రావతరణ దినంగా భావించలేదు. ఫలితంగా- 2014 నుంచి ఇప్పటిదాకా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించలేని రాష్ట్రం అంటూ మనదేశంలో ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమే. చంద్రబాబు నాయుడు వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు చేపట్టినప్పటికీ.. వాటి వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు కలగలేదనే చెబుతున్నారు సామాన్య ప్రజలు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటూ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీని తిట్టడానికే నవ నిర్మాణ దీక్షలను పరిమితం చేశారని, ఆ తరువాత అదే పార్టీ పంచన చేరారంటూ ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు.

వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయమేంటీ?

వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయమేంటీ?


మొన్నటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. వైఎస్ జగన్ అధికారాన్ని అందుకున్న తరువాత తొలిసారిగా రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నిర్వహించాల్సిన ఉంటుంది. ఆ తేదీ ఎప్పుడనేది ఇంకా స్పష్టం కాలేదు. తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని ఏర్పాటైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన నవంబర్ 1వ తేదీ నాడే రాష్ట్రావతరణ దినోత్సవాన్ని చేపడతారా? లేక తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా కర్నూలు రాజధానిగా ఆవిర్భవించిన అక్టోబర్ 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కర్నూలు రాజధానిగా, తెలంగాణ రహిత ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైన అక్టోబర్ 1వ తేదీ నాడే రాష్ట్రావరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా కొన్ని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

 పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా..

పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా..

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగానికి గుర్తుగా అక్టోబర్ 1వ తేదీ నాడే 13 జిల్లాలతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావరణ దినోత్సవాన్ని నిర్వహించాలనే డిమాండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ఈ డిమాండ్ ను లేవదీశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్నూలును రాజధానిగా ప్రకటించే అవకాశాలు లేకపోవడం వల్ల కనీసం హైకోర్టునైనా ఇక్కడ ఏర్పాటు చేయాలని అంటున్నారు. మద్రాసు స్టేట్ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబరు 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఏర్పాటైంది. 1956లో తెలంగాణాతో కలిసి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించిన తేదీ నవంబరు 1. నాడు ఆంధ్రరాష్ట్రంలో కలిసిన తెలంగాణ ప్రాంతం ఇప్పుడెలాగూ లేనందున.. అక్టోబర్ 1వ తేదీ నాడే ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే నవంబర్‌ 1వ తేదీ నాడే ఈ వేడుకలు నిర్వహిస్తామంటూ వైఎస్‌ జగన్ ఇదివరకు ప్రకటించారు. ఆ ప్రకటనకు కట్టుబడి ఉంటారా? లేక అక్టోబర్ 1న రాష్ట్రావతరణ వేడుకలను నిర్వహిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

English summary
The Rayalaseema Saguneeti Sadhana Samithi (RSSS) demanded that the new Andhra Pradesh capital be set up in Rayalaseema region. It also demanded that state formation day be celebrated on October 1 instead of June 2 as it is celebrated now. RSSS’s demand for State formation day should be celebrate on October 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X