• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ -జగన్‌పై ‘క్రిస్మస్’ బాంబు -జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు -పవన్‌కు షాక్

|

ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై వరుస దాడులు, క్రైస్తవ పాస్టర్లకు భృతి అంశాల్లో అధికార వైసీపీని విమర్శిస్తోన్న బీజేపీ.. తాజాగా 'పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు' అంశంపై రచ్చకు దిగింది. సీఎం జగన్ క్రిస్టియానిటీని ప్రస్తావిస్తూ, ప్రభుత్వమే క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నదంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆరోపణలు చేశరు. అంతటితో ఆగకుండా..

  ఏపీలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ GVL Narasimharao Sensational Comments జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

  కేసీఆర్‌‌కు మరో షాక్: 'వెలమ' అస్త్రం -బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు -సొంతకులంలో కలకలంకేసీఆర్‌‌కు మరో షాక్: 'వెలమ' అస్త్రం -బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు -సొంతకులంలో కలకలం

   ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్..

  ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్..

  తెలంగాణలో ప్రత్యర్థుల ఆటకట్టించడానికి ఒక సర్జికల్ స్ట్రైక్ అవరమైతే.. ఆంధ్రప్రదేశ్ లో రెండు సర్జికల్ స్ట్రైక్ అవసరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రెండూ మతతత్వ పార్టీలేనని, మత రాజకీయాల్లో వైసీపీ, బీజేపీ పోటీ పడుతున్నాయని, ఆ రెండిటిపైనా రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

   పోలీసుల శాంటా టోపీలపై వివాదం

  పోలీసుల శాంటా టోపీలపై వివాదం

  విజయవాడ మూడో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో గత వారం సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా పోలీసులు మూడు సింహాల టోపీలను పక్కనపెట్టి, శాంటాక్లాజ్ టోపీలు ధరించడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వేడుకల వీడియోను ట్వీట్ చేస్తూ... ‘‘41 రోజులు అయప్ప మాల ధరించిన పోలీసులు కూడా నాలుగు సింహాలున్న టోపీని గౌరవిస్తారు. పవిత్ర రంజాన్ మాసంలో 41 రోజులు ఉపవాస దీక్ష చేసే ముస్లింలు కూడా నాలుగు సింహాలున్న టోపీని అంతే గౌరవంతో చూస్తారు. మరి క్రిస్మస్ సమయంలో ఆ అవసరం లేదా? లేకుంటే ఆంధ్రాలో నాలుగు సింహాల టోపీకి విలువ తగ్గించారా? 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కోవిడ్ నిబంధనలు అమలు చేస్తారు. ప్రతి సంవత్సరం జరుపుకోనే వినాయక చవితి పండుగకు విగ్రహాలు పెట్టకూడదంటారు. మరి వీరికి మాత్రం ఏ నిబందనలూ వర్తించవా?' అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. సదరు వ్యాఖ్యలను సమర్థించిన ఎంపీ జీవీఎల్..

  ప్రభుత్వ మత ప్రచారమంటూ..

  ప్రభుత్వ మత ప్రచారమంటూ..

  పోలీస్ స్టేషన్‌లో క్రిస్మస్ పండుగ సంబరాలపై మండిపడ్డ జీవీఎల్... ప్రభుత్వమే క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యలో కూడా ముస్లిం ఓట్ల కోసం పోలీసులను వేధించారని అన్నారు. లౌకిక పార్టీల పేరుతో వైసీపీ, టీడీపీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దేవాలయాలే దండగన్న మహానుభావుడు చంద్రబాబు అని.. ఆయన కూడా హిందూయిజం గురించి మాట్లాడుతున్నారని జీవీఎల్‌ దుయ్యబట్టారు. అంతేకాదు..

  తిరుపతి విజయంతో సమాధానం..

  తిరుపతి విజయంతో సమాధానం..

  తిరుపతి ఉప ఎన్నికలో రెండు పార్టీలకు బుద్ధి చెబుతామని జీవీఎల్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నిధులు ఉన్నాయని, పెట్టుబడి అంతా నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అన్నారు. గత టీడీపీని, ఇప్పటి వైసీపీ సర్కార్‌కు ఛాలెంజ్ చేస్తున్నామని, వాళ్లు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి వేదికగా సమాధానం చెప్పాలన్నారు. లౌకిక పార్టీల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాబోయే తిరుపతి ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీలూ వీటికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.

  పవన్‌కు షాక్ తిరుపతిలో బీజేపీనే?

  పవన్‌కు షాక్ తిరుపతిలో బీజేపీనే?

  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీనే బరిలోకి దిగాలని భావిస్తోందని ఎంపీ జీవీఎల్ అన్నారు. అయితే జనసేనతో పొత్తు కారణంగా పవన్ కల్యాణ్ తో కలిసే పోటీ చేయాల్సి ఉంటుందన్నారు. తిరుపతి సీటుపై బీజేపీ ఆసక్తిగానే ఉన్నా, పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన నాయకులు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారని, అందుకే తిరుపతి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ ప్రకటనకు మరికొంత సమయం పడుతుందని ఎంపీ జీవీఎల్ అన్నారు. మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం తిరుపతిలో తమ అభ్యర్తే బరిలో ఉంటారని ప్రకటించారు. జాయింట్ కమిటీ రిపోర్టు రాకముందే సోము ఏకపక్ష ప్రకటన చేయడాన్ని జనసైనికులు అవమానంగా భావిస్తున్నారు. దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

  షాకింగ్: బీజేపీతో టీఆర్ఎస్ సంధి? -హైదరాబాద్‌కు కేసీఆర్‌, ఢిల్లీకి బండి సంజయ్‌ -ఏం జరుగుతోంది?షాకింగ్: బీజేపీతో టీఆర్ఎస్ సంధి? -హైదరాబాద్‌కు కేసీఆర్‌, ఢిల్లీకి బండి సంజయ్‌ -ఏం జరుగుతోంది?

  English summary
  the bjp warns for surgical strike in andhra pradesh. bjp mp gvl narasimharao slams ap cm ys jagan and ysrcp govt for official christmas celebrations in police stations. gvls also spoke on tdp chief chandrababu and janasena chief pawan kalyan
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X