కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలో జగన్‌కు ఊహించని షాక్: సీనియర్లు దూరం కావడమూ కారణమే!

తన పార్టీ టిక్కెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు మొదలు.. నేడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి వరకు వైసిపి అధినేత వైయస్ జగన్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. జగన్ ఓటమిపై ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తన పార్టీ టిక్కెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు మొదలు.. నేడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి వరకు వైసిపి అధినేత వైయస్ జగన్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. జగన్ ఓటమిపై ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అందులో.. జగన్ సీనియర్లను వదులుకోవడం. అనుభవం కలిగిన నేతలను వదులుకోవడం జగన్‌కు నష్టం చేస్తోందని అంటున్నారు. భూమా నాగిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్లను వదులుకున్నారు.

<strong>కడప షాక్‌కు కారణాలెన్నో: అలా ముందే జగన్ లీక్, చంద్రబాబు పైఎత్తు</strong>కడప షాక్‌కు కారణాలెన్నో: అలా ముందే జగన్ లీక్, చంద్రబాబు పైఎత్తు

సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా అందరు కూడా జగన్ తీరును తప్పుపడుతూనే దూరమయ్యారు. జగన్ ఎవర్నీ ఖాతరు చేయరని, ఆయన చెప్పిన ప్రకారమే నడుచుకోవాలని, సీనియర్ల సూచనలు, వారిని పట్టించుకోరనే ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో.... ముఖ్యంగా జగన్ సొంత ఇలాకా కడపలో టిడిపి అభ్యర్థి బీటెక్ రవి గెలుపొందిన తర్వాత మరోసారి జగన్ తీరుపై, ఆయనను వదిలిన సీనియర్ల అంశం చర్చకు వస్తోంది.

జగన్ పట్టించుకోకపోవడానికి కారణాలు!

జగన్ పట్టించుకోకపోవడానికి కారణాలు!

పార్టీ నుంచి సీనియర్లు వెళ్లినా జగన్ లైట్‌గా తీసుకుంటారని అంటారు. సీనియర్లయినా, ఎవరైనా ఆయన పట్టించుకోరని అంటారు. ఇందుకు వైయస్ రాజశేఖర రెడ్డి చరిష్మా మీద ఉన్న నమ్మకంతో పాటు, తనను ఎవరూ ఓడించలేరనే అతి విశ్వాసమే కారణమని అంటున్నారు.

భూమా నాగిరెడ్డి

భూమా నాగిరెడ్డి

ఇటీవలే మృతి చెందిన భూమా నాగిరెడ్డి కొద్ది నెలల క్రితం వైసిపి నుంచి టిడిపిలో చేరారు. భూమా దంపతులు చాలాకాలం టిడిపిలో ఉన్నారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక అందులోకి వెళ్లారు. పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో.. భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డిలు వైసిపిలో చేరారు. రాజకీయ వ్యూహాల్లో జగన్‌కు శోభ చాలా మద్దతుగా నిలిచారు.

2014 ఎన్నికల సమయంలో శోభ మృతి చెందారు. అప్పటి నుంచి జగన్‌కు భూమా జిల్లాలో, రాష్ట్ర రాజకీయాల్లో అండగా నిలిచారు. భూమాకు పీఏసీ చైర్మన్ పదవిని ఇచ్చారు. కానీ ఆ తర్వాత క్రమంగా భూమా ఫ్యామిలీ జగన్‌కు దూరమయింది. ఆ తర్వాత టిడిపిలో చేరారు.

మైసూరా రెడ్డి

మైసూరా రెడ్డి

వైయస్ రాజశేఖర రెడ్డికి మైసూరా రెడ్డి చాలా దగ్గర. ఆయన ఆత్మగా కూడా చెబుతారు. అలాంటి మైసూరా రెడ్డి కూడా జగన్‌కు దూరం జరిగారు. ఆయన దూరం జరిగినప్పుడు మాత్రం జగన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన అసంతృప్తితో జగన్‌ను వీడారు. అయితే, పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం జగన్ ఇవ్వలేదనే వాదనలు ఉన్నాయి.

సబ్బం హరి

సబ్బం హరి

సబ్బం హరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినప్పటికీ.. 2 ఎన్నికలకు ముందు జగన్‌కు నైతికంగా మద్దతు పలికారు. కానీ ఆ తర్వాత అసంతృప్తితో పార్టీలో చేరకుండానే వైసిపి అధినేతకు దూరం జరిగారు.

జ్యోతుల నెహ్రూ

జ్యోతుల నెహ్రూ

ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుందనే వాదన ఉంది. ఆ జిల్లాల్లో కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువ. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం కారణంగా కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో టిడిపి ఎక్కువ సీట్లు సాధించిందని చెబుతారు. అలాంటి జిల్లాల్లో కీలక నేత జ్యోతుల నెహ్రూ. అలాంటి జ్యోతుల నెహ్రూ కూడా తీవ్ర అసంతృప్తితో బయటకు వచ్చారు.

భూమా నాగిరెడ్డి వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత.. పీఏసీ చైర్మన్ పదవి జ్యోతులకు వస్తుందని భావించారు. కానీ జగన్ మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. సీనియర్లను పట్టించుకోరని చెప్పేందుకు ఇది కూడా ఓ నిదర్శనం అనే విమర్శలు ఉన్నాయి.

వారినే నమ్ముకున్నారా..!

వారినే నమ్ముకున్నారా..!

వైయస్ జగన్ రాజకీయ అనుభవం, వ్యూహాలు రచించే సీనియర్లను పక్కన పెట్టి కేవలం ప్రస్తుతానికి గట్టిగా మాట్లాడే నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటారు. రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారు నిత్యం విమర్శలు గుప్పిస్తారు. అలాంటి వారికి ఇచ్చిన ప్రాధాన్యత జగన్ సీనియర్లకు ఇవ్వలేకపోవడం వల్లే షాక్‌లు తగులుతున్నాయని అంటున్నారు.

English summary
After, YSR Congress party defeat in Kadapa MLC Elections all are talking about senior leaders who were join TDP and another parties from YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X