వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ జగన్..కేంద్రం వర్సెస్ ఏపి :మతం ముద్ర..నిర్ణయాల పై సీరియస్:సాయిరెడ్డి కామెంట్స్ బూమ్ రాంగ్..

|
Google Oneindia TeluguNews

Recommended Video

జరుసలెం మత ప్రచారం పై చిక్కుల్లో జగన్ ప్రభుత్వం|Religious Propoganda Created Troubles For Jagan Govt

ఏపీ ముఖ్యమంత్రి జగన చక్రబంధంలో చిక్కుకుంటున్నారు. రాజకీయంగా మూకుమ్మడి దాడి జరుగుతోంది. అండగా నిలిచేవారు కరువయ్యారు. ముఖ్యమంత్రి అయి మూడు నెలలు కూడా పూర్తి కాకుండనే రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా.. జగన్ పైన మతం ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. తిరుమలలో టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జాతీయ స్థాయిలో జగన్ ను దోషిని చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ నేతల ట్వీట్లు..కామెంట్లు జగన్ ను డామేజ్ చేసేలా ఉన్నాయి. దీనిని తిప్పి కొట్టేందుకు ఏపీ మంత్రులు చేస్తున్న ప్రయత్నాలను జాతీయ నేతల కామెంట్లు డామినేట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో పోలవరం లో రివర్స్ టెండరింగ్ వ్యవహారం పైన కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీతో పెరుగుతున్న గ్యాప్ ను స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని..అమిత్ షా ఆశీస్సులతో నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి. అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన జగన్ ఇప్పుడు ఈ వివాదాలకు ఎటువంటి ముగింపు ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

కేంద్రం వర్సెస్ జగన్..

కేంద్రం వర్సెస్ జగన్..

పోలవరం విషయంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలంగా మారాయి. రివర్స్ టెండరింగ్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పైన పీపీఏ తో పాటుగా కేంద్ర మంత్రి సైతం సీరియస్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులిచ్చేది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రాజెక్టు విషయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొనే పూర్తిస్థాయి అధికారం మాకుంది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మీరు(రాష్ట్రప్రభుత్వం) చేపట్టినంత మాత్రాన మాకు చెప్పకుండా ఇష్టానుసారం చేయడం కుదరదు. అక్కడ జరిగే ప్రతి విషయం మాకు తెలియాలి. అందుకే అన్ని విషయాలపై నివేదిక కోరాం. వచ్చిన తర్వాత పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. అదే సమయంలో పీపీఏ ల విషయంలో సైతం ఏపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. పీపీఏల సమీక్ష పేరుతో మొదలైన రగడ న్యాయస్థానికి చేరింది. దీని పైన కేంద్రం మొదలు అంతర్జాతీయ సంస్థలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీని పైన వస్తున్న విమర్శలకు సమాధానంగా తమ వైఖరి ఏంటి.. ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటుందీ వివరించటంలో ఏపీ ప్రభుత్వ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్లలేదు. ఇప్పుడు పోలవరం పైన ఇలా వివాదం ఉండగానే..రాజధాని పైన అనేక రకాలుగా ప్రచారం తెర మీదకు వచ్చింది. ఇది కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చుట్టూ తిరిగుతోంది. దీని పైన కేంద్రం జగన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది.

 సాయిరెడ్డి వ్యాఖ్యలు బూమ్ రాంగ్..

సాయిరెడ్డి వ్యాఖ్యలు బూమ్ రాంగ్..

ఇక, వైసీపీ సీనియర్ నేత విజయ సాయిరెడ్డి ఢిల్లీ కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు బూమ్ రాంగ్ అయ్యాయి. ప్రధాని మోదీ..అమిత్ షా ఆశీస్సులు తమకు ఉన్నాయని..వారి అనుమతితోనే నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు. వారిద్దరి పేర్లు చెప్పి..మద్దతు ఉందని చెప్పటం మీద బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఒక వేళ నిజంగా వారికి చెప్పి..సమస్యను వివరించిన తరువాతనే నిర్ణయాలు తీసుకున్నా..ప్రధాని మద్దతు తమకు ఉందంటూ అంత ఓపెన గా చెప్పటం పరిణితి చెందిన వారు చేసేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీని పైన ఏపీ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో కేంద్ మంత్రి షెకావత్ సైతం దీని పైన స్పందించారు. మనం ఇప్పుడు సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై రాష్ట్రం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర పరిధిలోని అంశాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. తప్పితే ఎవరి ఆశీస్సులు ఎవరికీ ఉండవు అని వ్యాఖ్యానించారు. పీపీఏలు, పోలవరం, నవయుగ కాంట్రాక్టు రద్దు, అమరావతి పైన కొత్త ఆలోచనలు..ఇప్పుడు ఇవన్నీ జగన్ మెడకు చుట్టుకున్నాయి. వీటి విషయంలో జగన్ ఎలా వ్యవహరిస్తారు.. ఏ రకంగా పరిష్కరిస్తారని రాజకీయ పార్టీలతో సహా సాధారణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

జగన్ పైన మతం ముద్ర..

జగన్ పైన మతం ముద్ర..

ఇప్పుడే కాదు..ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుండి జగన్ పైన మతం ముద్ర వేసేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుమలలో బస్ టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం ప్రకటనలు ఉండటంతో రగడ మొదలైంది. అయితే, అవి టీడీపీ ప్రభుత్వంలో పధకాలను టిక్కెట్ల వెనుక ప్రకటనలుగా ముద్రించారని.. నెల్లూరు నుండి పొరపాటున తిరుమలకు చేరాయని చెబుతున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీని మీద బీజేపీ ఏపీ నేతలే కాదు..జాతీయ నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సైతం తన ట్వీట్టర్ ఖాతాలో తిరుమల టిక్కెట్ల వెనుక జెరూసెలం యాత్రం గురించి ఉన్న ప్రకటనల గురించి ప్రస్తావించారు.ఇక, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ థియోధర్ సైతం ట్వీట్ చేసారు. రావాలి జేసు..కావాలి జేసు అంటూ ట్వీట్ చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సులో టికెట్ల వెనుక అన్యమత ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ తిరుపతిలో అన్నారు. తిరుమల భక్తులను లక్ష్యంగా చేసుకుని హిందువులను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయంటూ బీజేపీ ధార్మిక సెల్‌ అధ్యక్షుడు శ్రీకృష్ణ చైతన్య మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఆర్టీసీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దీని పైన రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తున్నా..విమర్శలు మాత్రం ఆగటం లేదు. ఇప్పుడు వీటన్నింటికీ ముఖ్యమంత్రి జగన్ ను బాధ్యుడిని చేసి ఆరోపణలు చేస్తున్నారు. మరి..జగన్ వీటికి ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.

English summary
Now political war begins as Cent govt as Ap Govt. Central Minister Shekawath serious comments on AP Govt decisoions. At the same time religious propoganda created troubles for Jagan govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X