ఎన్ టి ఆర్ అడిగితేనే భువనేశ్వరిని పెళ్ళాడా: చంద్రబాబు
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుదవారం నాడు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత విషయాలను ఆయన సభలో చెప్పారు.
అమరావతి:ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుదవారం నాడు అసెంబ్లీలో రాజకీయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడ ప్రస్తావించారు. అసెంబ్లీలో వైసిపి సభ్యులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు
రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ తాను ఎలా వ్యవహరించానో ఆయన ప్రస్తావించారు.రాజకీయాల్లో ఉన్న కుటుంబమైనందున ఇతరులపై ఆధారపడకూడదనే ఉద్దేశ్యంతోనే 25 ఏళ్ళ క్రితమే తాను డెయిరీ వ్యాపారాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
హైద్రాబాద్ లో ఏ మూలకు వెళ్ళినా తాను చేసిన అభివృద్దే కన్పిస్తోందని ఆయన గుర్తు చేసుకొన్నారు.అదే తరహలో ఆంద్రప్రదేశ్ ను కూడ అభివృద్ది చేయాలనేదే తన అభిమతమన్నారు చంద్రబాబునాయుడు.
అసెంబ్లీలో వైసిపి అనుసరిస్తున్న వైఖరి పట్ట ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.అయితే తన రాజకీయ జీవితంలో ఈ తరహ విపక్షాన్ని తాను ఏనాడు చూడలేదని బాబు వ్యాఖ్యానించారు.

ఎన్ టి ఆర్ అడిగితేనే భువనేశ్వరిని పెళ్ళాడా
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుదవారం నాడు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత విషయాలను ఆయన సభలో చెప్పారు.
చదువుకొంటూనే రాజకీయాల్లోకి వచ్చాననని అదే సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో స్వశక్తితో ఎదిగానని ఆయన చెప్పారు.
రాజకీయాల్లో తన ఎదుగుదల చూసిన తర్వాత తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలని ఎన్ టి ఆర్ భావించారని చెప్పారు.తన కూతురును పెళ్ళి చేసుకోవాలని ఎన్ టి ఆర్ తనను కోరిన విషయాన్ని ఆయన అసెంబ్లీలో చెప్పారు.

డెయిరీ వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించానంటే
రాజకీయాల్లో ఉన్నప్పుడే కుటుంబ బాధ్యతలను కూడ తాను చూసుకొంటున్నానని చంద్రబాబు చెప్పారు.రాజకీయాలతో కుటుంబం ఆధారపడకూడదని నిర్ణయం తీసుకొన్నానని చెప్పారు.ఈ నిర్ణయం ఆధారంగానే తాను 25 ఏళ్ళ సంవత్సరాల క్రితమే డెయిరీ పెట్టానని ఆయన చెప్పారు.రాజకీయాలతో పాటు వ్యాపారాన్ని కూడ చూసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.వ్యాపారాన్ని ప్రారంభించిన రెండేళ్ళపాటు అసెంబ్లీ అయిపోయాక, పార్టీ పనులు చూసుకొంటూ వ్యాపారానికి కూడ గంట సమయాన్ని కేటాయించినట్టు ఆయన చెప్పారు.మంత్రి పదవి వచ్చిన తర్వాత వ్యాపార బాధ్యతలను తన భార్య భువనేశ్వరికి అప్పగించానని చంద్రబాబు చెప్పారు.24 ఏళ్ళుగా డెయిరీ బాధ్యతలను తన భార్యే చూసుకొంటుందన్నారు చంద్రబాబునాయుడు.తన ఇంట్లో ఎవరికీ కూడ అభద్రతా భావం లేదని ఆయన చెప్పారు.

.వైసిపి సభ్యుల తీరుతో సమయం వృధా
అసెంబ్లీలో వైసిపి సభ్యులు అనుసరిస్తున్న తీరుతో శాసనసభ సమయం వృధా అవుతోందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లీలో ఆయన వైసిపి ప్రవర్తనను ఎండగట్టారు. వైసిపి సభ్యులు తమ వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచించారు. సభలో తాము చెప్పినట్టుగానే జరగాలని కోరుకోవడం సరికాదని ఆయన వైసిపి సభ్యులకు హితవు పలికారు.40 ఏళ్ళ తన అనుభవంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఏనాడూ చూడలేదని ఆయన చెప్పారు.

మైక్ కోసం నేను పోరాడాను
అసెంబ్లీలో నేను మైక్ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబునాయుడు గుర్తుచేసుకొన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షనాయకుడిగా ఉన్న సమయంలో తనకు మైక్ కావాలంటూ పోరాటం చేసిన పరిస్థితులను ఆయన గుర్తుకు తెచ్చుకొన్నారు.అయితే ప్రస్తుతం విపక్ష సభ్యులు అడగకుండానే వైసిపి సభ్యులకు మైక్ ఇస్తున్న విషయాన్ని ఆయన చెప్పారు.

నవ్యాంధ్రను అభివృద్ది చేయాలనేదే నా తపన
నవ్యాంధ్రను అభివృద్ది చేయాలనేదే తన తపన అన్నారు ఎపి సిఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో చెప్పారు.హైద్రాబాద్ లో ఏ మూలకు వె్ళినా తాను చేసిన అభివృద్దే కన్పిస్తోందని బాబు గుర్తుచేశారు. నవ్యాంద్రను కూడ అలాగే అభివృద్ది చేయాలనేది తపన అన్నారు. నా పేరు శాశ్వతంగా గుర్తుండాలని కష్టపడుతున్నానని ఆయన చెప్పారు.గౌరవం నిలుపుకొనేందుకుగాను స్వీయ క్రమశిక్షణను పాటిస్తున్నానని ఆయన చెప్పారు.

జగన్ అసత్యప్రచారం
ఒకే విషయాన్ని పదే పదే ప్రచారం చేయడం వల్ల ప్రజలు నమ్ముతారని జగన్ నమ్ముతున్నట్టు కన్పిస్తోందని చంద్రబాబు చెప్పారు. తనపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.11 చార్జీషీట్స్ లో నిందితుడిగా ఉండి 16 నెలలపాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

ప్రధానిని ఎంపిక చేసే అవకాశం దక్కింది
ప్రధానమంత్రిని కూడ ఎంపిక చేసే అవకాశం తనకు దక్కిందని ఎపి సిఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ఈ విషయానికి తాను సంతోష పడుతున్నట్టుగా ఆయన చెప్పారు.సుదీర్ఘకాలంపాటు ముఖ్యమంత్రిగా, విపక్షనాయకుడిగా ఉన్నానని చెప్పారు. ప్రజాసేవ తప్ప తనకు మరో ధ్యాస లేదని చెప్పారు. ప్రతి ఏడాది తనతో పాటు తన కుటుంబసభ్యులు కూడ ఆస్తులను ప్రకటిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
-
రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా - ఢిల్లీ కేంద్రంగా..!! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications