విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జ‌గ‌న్ ఫొటో పెట్టం: మా సీఎం ఇంకా ఆయ‌నే : ఓ యూనివ‌ర్సిటీ అధికారుల నిర్వాకం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించి 50 రోజులు పూర్త‌వుతోంది. కానీ, ఇంకా కొంత మంది ఉద్యోగులు మాత్రం గ‌తంలో ప‌ని చేసిన వారే ఇంకా ముఖ్య‌మంత్రిగా ఉన్నార‌నే భావ‌న‌లో ఉన్నారు. ఏపీలోని అన్ని యూనివ‌ర్సిటీల్లో ప్ర‌తీ వైస్ ఛాన్స‌ల‌ర్ల ఛాంబ‌ర్ల‌లో ముఖ్య‌మంత్రి ఫొటో ఏర్పాటు చేసారు. అయితే స్వ‌యంగా వీసీ ఆదేశించినా అక్క‌డ కొంత మంది అధికారులు మాత్రం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫొటో ఏర్పాటుకు స‌సేమిరా అంటున్నారు. గ‌తంలో ప‌ని చేసిన ఆయ‌నే త‌మ సీఎం అని చెబుతున్నారు.

జ‌గ‌న్ ఫొటో పెట్ట‌మంటున్న సిబ్బంది..
ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత ఆయ‌న ఫొటో ఏర్పాటు చేయ‌టానికి ఇంకా కొన్ని చోట్ల అధికా రుల‌కు మ‌న‌సు అంగీక‌రించ‌టం లేదు. తాజాగా..విజ‌య‌వాడ‌లోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో రాష్ట్ర ము ఖ్యమంత్రి జగన్‌ ఫొటో పెట్టేందుకు ప్రయత్నించగా కొంత మంది అడ్డుకుంటున్నారు. తన చాంబర్‌లో సీఎం జగన్‌ ఫొటో పెట్టాలని స్వ‌యంగా హెల్త్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ సీవీ రావు ఆదేశించినా సంబంధిత అధికారులు బేఖా తర్ అంటున‌నారు. ముఖ్యంగా వర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న కొంత మంది ఉద్యోగులు సీఎం ఫొటో పెట్టే విషయంలో కింది స్థాయి సిబ్బంది మీద ఒత్తిడి తెచ్చి జ‌గ‌న్ ఫొటో ఏర్పాటు చేయ‌కుండా అడ్డుకుంటున్న‌ట్లు వ‌ర్సిటీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇక్క‌డ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హారాలు న‌డిచాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి కార్యాల‌యం సైతం ఇక్క‌డ ఏర్పాటు చేసారు.

NTR Health University officer not interesting in display CM Jagan photo in University.

ఏంటీ ధిక్కార స్వ‌రం..ఎందుకంటే
సీఎం ఫొటో పెట్టే విషయమై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాలేదంటూ కొందరు అధికారులు సాకులు చెబుతు న్నారు. అయితే యూనివర్సిటీ పక్కనే ఉన్న సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలోని ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో..విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో ఇప్పటికే ఏర్పాటు చేసారు. గత ప్రభుత్వంలో ఎక్కడా లేని విధంగా వర్సిటీలోనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన అధికారులే.. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టేందుకు మనసొప్పక అడ్డుకుంటున్నారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. వర్సిటీలోని పరిపాలన, ఇంజ నీరింగ్‌ తదితర విభాగాల్లో కీలక పోస్టుల్లో పనిచేసే కొంత మంది అధికారులు, ఉద్యోగులు గత ముఖ్యమంత్రి మీద అమి తమైన మక్కువతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. మ‌రి..ఇప్పుడు ప్ర‌భుత్వం ఇక్క‌డి వ్య‌వ‌హారాల పైన ఏ ర‌కంగా స్పందిస్తుందో చూడాలి.

English summary
NTR Health University officer not interesting in display CM Jagan photo in University. VC already ordered for fix of CM photo in his chamber. But some of the staff rejecting this matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X