వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్టు టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు: ఢిల్లీకి బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పేరునే ఉంచి, డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్ట్‌కు మాత్రం ఎన్టీఆర్‌ పేరును ఖరారు చేశారు. విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. బేగంపేటలో విమానాశ్రయం ఉన్నపడు డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ పేరు ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం డెమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నిరాకరించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం 21వ తేదీ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. హుధుద్ తుఫాను నష్టం, రాష్ర్టానికి ప్రత్యేక హోదా, తెలంగాణ రాష్ట్రంతో జల జగడం, ప్రత్యేక రైల్వే జోన్‌ తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సర్వం సిద్ధమైంది.

NTR name to Shamshabad airport domestic terminal

21వ తేదీ ఉదయం కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీతో బాబు సమావేశం అవుతారు. యువజన బిల్లులో పేర్కొన్న అంశాలపై చర్చిస్తారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జైట్లీని కోరనున్నారు. ఏపీకు వచ్చే ఆర్థిక వెసులుబాటుతోపాటు మొదటి ఏడాది ఆర్థిక లోటు కింద రాష్ర్టానికి ఇస్తామన్న రూ. 16వేల కోట్ల నిధుల అంశంపై చర్చించనున్నారు.

ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. విభజన బిల్లులోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశంపై చర్సిస్తారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్న చంద్రబాబు అందుకు అనుగుణంగా కేంద్ర సాయం కోరనున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా విడుదల చేయాలని ఉమా భారతిని కోరనున్నారు.

తెలంగాణతో నీటి వివాదంపై చంద్రబాబు కేంద్రమంత్రితో చర్చించే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడంపై కూడా కేంద్రమంత్రికి బాబు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియవచ్చింది. రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుతో కూడా బాబు భేటీ కానున్నారు. యువజన బిల్లులో పేర్కొన్నట్లు ప్రత్యేక రైల్వే జోన్‌ అంశంపై చర్చించనున్నారు.

దానితోపాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతిపై కూడా ఆయన చర్చించనున్నారు. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ ఇస్తే శనివారం కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉంటారు. తుపాన్‌ నష్టంపై పూర్తి స్థాయి నివేదికను ప్రధానికి అందించనున్నారు.

English summary
Civil aviation ministry has decided to name Shamshababd Rajiv Gandhi international airport domestic terminal to name after NT Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X