విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి ఏర్పాటుకు కారణమిదే, బిజెపికి తెలుగోడి సత్తా చూపుదాం: బాలకృష్ణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: టిడిపి ఆవిర్భావం దేశ రాజకీయ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికిందని హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేచ్చని బిజెపికి తెలుగోడి సత్తాను చూపిస్తామని బాలకృష్ణ హెచ్చరించారు.

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం నాడు మహనాడులో బాలకృష్ణ ప్రసంగించారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని బాలకృష్ణ చెప్పారు. నిస్వార్ధ:గా పనిచేసే కార్యకర్తలు టిడిపికి ఉన్నారని ఆయన చెప్పారు.

NTR started TDP for serving to poor people says Balakrishna

2014 ఎన్నికల్లో ఏపీలో టిడిపి అధికారంలోకి రావడానికి కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారని ఆయన చెప్పారు. అంకితభావంతో టిడిపి కార్యకర్తలు పనిచేస్తారని ఆయన గుర్తు చేశారు.

నిస్వార్ధంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఏ పార్టీకి లేరని, ఏ జాతీయ పార్టీకి కూడ ఈ తరహ కార్యకర్తలు లేరని ఆయన చెప్పారు. పార్టీ ఏ పిలుపు
ఇచ్చినా దాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసే కార్యకర్తలు టిడిపి ఆస్థిగా ఆయన అభివర్ణించారు.

ప్రజలకు ఏదో చేయాలనే తపనతోనే ఆనాడు ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేసేందుకు చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.ఎన్టీఆర్ బయోపిక్ తీయడం తన అదృష్టంగా చెప్పారు. తండ్రి పాత్రను తాను చేయడం తనకు చాలా ఆనందాన్ని ఇస్తోందని ఆయన చెప్పారు.

చంద్రబాబునాయుడు అనేక సంక్షోభాలను చూశారని ఆయన చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రంపై పోరాటం చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయని ఆ ఎన్నికల్లో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని బాలకృష్ణ చెప్పారు.రానున్న ఎన్నికల్లో బిజెపిని, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న పార్టీలను ఓడించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

English summary
Hindupur MLA Balakrishna said that NTR started TDP for serving to poor people in Andhra Pradesh.He participated in Mahanadu second day at Vijayawada on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X