విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు, మద్యం సీసా దండలు

By Pratap
|
Google Oneindia TeluguNews

 NTR statue insulted with chappals
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, మద్యం సీసా దండలు వేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘటనా స్థలిలో రాస్తారోకో చేశారు.

ఈ చర్యలకు పాల్పడినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని పసుపు నీటితో కడిగి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. ఇటు టిడిపి మహానాడు హైదరాబాదులో జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

కూలిన భవనం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జి దగ్గర మంగళవారం ఉదయం ఓ భవనం కుప్పకూలింది. వెంటనే సహాయ సిబ్బంది అక్కడకు చేరుకుని శిథిలాల కింద ఉన్న తల్లికొడుకును బయటకు తీశారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. గత అర్థరాత్రి ప్రధాన ద్వారమైన ఎలక్ట్రికల్ గేటు కుప్పకూలింది. ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన నీల్‌దాస్(47)గా గుర్తించారు.

English summary
Telugudesam party founder NT Rama Rao's statue has been insulted by unidentified persons with chappals and liquor bottles in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X