నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహం తరలింపు: వైసీపీ ఎమ్మెల్యేకు నందమూరి బాలకృష్ణ ఫోన్

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: జిల్లాలోని కావలి పట్టణంలో ముసునూరులో మహాలక్ష్మమ్మ ఆలయ స్థలంలో ఆలయానికి ఎదుట రెండేళ్ల క్రితం ఓ టీడీపీ నేత ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించడంపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు.

బాలకృష్ణ భారీ డైలాగ్ .. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో.. మేం అరిచే వాళ్ళం కాదు కరిచే వాళ్ళంబాలకృష్ణ భారీ డైలాగ్ .. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో.. మేం అరిచే వాళ్ళం కాదు కరిచే వాళ్ళం

కాగా, తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ప్రతిష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై పలువురు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. ఎన్టీఆర్ విగ్రహం తొలగించడంపై అధికార వైసీపీ నేతలపై మండిపడ్డారు.

ntr statue issue: nandamuri balakrisha phone call to ysrcp mla ramireddy pratap kumar reddy

ఈ క్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాస్తవ పరిస్థులను నందమూరి బాలకృష్ణకు వాట్సాప్ ద్వారా తెలియజేశారు. దీంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి గురువారం బాలకృష్ణ పోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి తీసుకున్న చొరవను అభినందినట్లు తెలిసింది.

అంతేగాక, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కూడా ఈ విషయంపై బాలకృష్ణ మాట్లాడారు. కాగా, రాజమండ్రి నుంచి కొత్తగా కొనుగోలు చేసిన ఎన్టీఆర్ విగ్రహం ముసునూరుకు చేరుకోవడంతో విగ్రహాన్నిప్రతిష్టించేందుకు పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగానే విగ్రహాన్ని ముసునూరు కూడలిలోని బస్ షెల్టర్ వద్దనే ఏర్పాటు చేస్తున్నారు.

English summary
ntr statue issue: nandamuri balakrisha phone call to ysrcp mla ramireddy pratap kumar reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X