• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుడివాడ క్యాసినో కల్చర్‌కు ఆద్యుడు ఆయనే: జయమాలిని పాటతో: ఆర్జీవీ బాంబు: కొడాలి నానికి సపోర్ట్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వివాదాస్పద స్టార్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. మరోసారి తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడు పడని విధంగా ఆయన ఘాటు కామెంట్స్ చేశారు.సినిమా టికెట్ల రేట్ల నియంత్రణ విషయంలో మొన్నటిదాకా- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఓ మినీ యుద్ధాన్నే చేసిన ఆయన- ఇప్పుడు తన రూటు మార్చారు. తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

హాట్ టాపిక్‌గా..

హాట్ టాపిక్‌గా..

సంక్రాంతి పండగ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారని, లక్షల రూపాయలు ఈ సందర్భంగా చేతులు మారాయంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిందీ అంశం.. తీవ్ర దుమారానికి దారి తీసింది. గుడివాడ- పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ జగన్, కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు .. ఈ క్యాసినో ఏర్పాటు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు.

కొడాలి నాని టార్గెట్‌గా..

కొడాలి నాని టార్గెట్‌గా..

కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ ఓ నిజనిర్ధారణ కమిటీని సైతం వేసిన విషయం తెలిసిందే. ఈ నిజనిర్ధారణ కమిటీలో మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యురో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమా మహేశ్వర రావు, తంగిరాల సౌమ్య ఉన్నారు. ఇటీవలే వారు గుడివాడలో పర్యటించారు.

క్యాసినో విషయంలో ఆర్జీవీ..

క్యాసినో విషయంలో ఆర్జీవీ..

ఈ పరిణామాల మధ్య రామ్‌గోపాల్ వర్మ మరోసారి తెర మీదికి వచ్చారు. కొడాలి నానికి అండగా నిలిచారు. గుడివాడలో క్యాసినో సంస్కృతి నెలకొనడానికి ఆధ్యుడు ఎవరో స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నించాల్సింది కొడాలి నానిని కాదని, దానికి ఆద్యుడైన వారినేనని అన్నారు. దీనిపై ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో వరుస పోస్టులు వేశారు. దీనికి యమలీల సినిమా పాటతో లింక్ పెట్టారు.

గుడివాడ ఎల్లాను..

గుడివాడ ఎల్లాను..

గుడివాడలో క్యాసినో తరహా సంస్కతి, వాతావరణం నెలకొనడానికి ఆద్యుడు- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావేనని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. గుడివాడ ఎల్లాను..గుంటూరు వచ్చాను..అంటూ ఎన్టీ రామారావు నటించిన యమగోలలోని పాట యూట్యూబ్ లింక్‌ను ఆయన తన ట్వీట్ చేశారు. జయమాలిని, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్యలపై చిత్రీకరించిన పాట అది. ఈ మూవీ దర్శకుడు కే రాఘవేంద్ర రావు.

1977లోనే

1977లోనే గుడివాడలో క్యాసినోల గురించి ఈ పాట ద్వారా తాను తెలుసుకున్నానని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. దీనికి ఆథరైజేషన్ పూర్తిగా ఎన్టీ రామారావుదేనని తేల్చి చెప్పారు. క్యాసినో సంస్కృతి గురించి కొడాలి నానిని ప్రశ్నించడానికి ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావును నిలదీయాల్సి ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. క్యాసినో తరహా పాటను ఎన్టీఆర్ తన సినిమాలో రాయించారని గుర్తు చేశారు.

కొడాలి నానిని తప్పుపట్టేలేం..

కొడాలి నానిని తప్పుపట్టేలేం..

గుడివాడలో క్యాసినోపై కొడాలి నానిని ఏ రకంగానూ విమర్శించలేమని, ఆయనను తప్పు పట్టలేమని రామ్‌గోపాల్ వర్మ స్పష్టం చేశారు. మంత్రి రాజీనామాను డిమాండ్ చేయడానికి ముందు వారు ఎన్టీ రామారావు గుడివాడ క్యాసినో కల్చర్ గురించి ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. స్వయానా తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తన సినిమాలో రాయించిన ఈ పాటపై తెలుగుదేశం నాయకులు మొదట రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

English summary
TDP founder and former CM NTR was the first person to encourage Casino style in Gudivada by allowing this Jaya Malini song in his film in the reference to this town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
Desktop Bottom Promotion