విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో లాక్ డౌన్ ప్రాంతాలివే- 3 కి.మీ దూరంలో ఆంక్షలు ప్రారంభం...

|
Google Oneindia TeluguNews

కేంద్రం కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతంగా ప్రకటించిన విజయవాడ నగరంలో లాక్ డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నగరంలోని కరోనా ప్రభావిత ప్రాంతాల వివరాలను ప్రకటించిన అధికారులు, వీటికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు. కాబట్టి ప్రజలు ఆయా ప్రాంతాల్లో పర్యటించకుండా అధికారులకు సహకరించాలని కోరారు.

విజయవాడలో కరోనా లాక్ డౌన్..

విజయవాడలో కరోనా లాక్ డౌన్..

విజయవాడలోని కొత్తపేట ప్రాంతంలో ఓ కరోన వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో లాక్ డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నగరం మొత్తం లాక్ డౌన్ పరిధిలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు కఠినంగా అమలవుతాయని అధికారులు ప్రకటించారు. నిషేధిత ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఆంక్షలు అమలు కానున్నాయి.

విజయవాడలో లాక్ డౌన్ ప్రాంతాలివే..

విజయవాడలో లాక్ డౌన్ ప్రాంతాలివే..

విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ గా గుర్తించిన విద్యార్ధి కొత్తపేటలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో 3 కి.మీ.ల పరిధిలోని భౌగోళిక ప్రాంతాలన్నింటినీ లాక్ డౌన్ క్రింద ప్రకటించారు. అలాగే కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారి ఇళ్లున్న ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ తూర్పు నియోజికవర్గ పరిధిలో 19, 20, 21, 22 డివిజన్లు కూడా లాక్ డౌన్ పరిధిలోకి వచ్చాయి.

 లాక్ డౌన్ ప్రాంతాల్లో ఆంక్షలివే..

లాక్ డౌన్ ప్రాంతాల్లో ఆంక్షలివే..

కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాల మేరకు కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన ప్రాంతాలకు ఎవరూ వెళ్లరాదు. స్థానికంగా ఎవరూ తిరగరాదు. అక్కడి పాఠశాలలు, సినిమాహాళ్లు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు మూసి ఉంచుతారు. ప్రజలు సమూహాలుగా అసలు గుమిగూడరాదు. వాహనాలు తిరగడానికి అనుమతించరు. అవసరమైన చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అనుమానితులను ఆసుపత్రిలో ఐసొలేషన్ (ప్రత్యేక వార్డు)లో ఉంచుతారు. పోలీసు, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారు.

 అవసరమైతే మిగతా ప్రాంతాలకూ..

అవసరమైతే మిగతా ప్రాంతాలకూ..

ప్రస్తుతానికి విజయవాడలోని కొత్తపేటతో పాటు తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొన్ని వార్డులకు మాత్రమే లాక్ డౌన్ ఆంక్షలు పరిమితం చేస్తున్నా.. అవసరాన్ని బట్టి మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది. అలాగే ప్రస్తుతం లాక్ డౌన్ విధించిన ప్రాంతాల్లో పరిస్ధితి అదుపులోకి వస్తే ఆంక్షలు తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. పరిస్ధితిలో మార్పు రాకపోతే మాత్రం ఈ నెల 31 వరకూ ఇవి కొనసాగుతాయి.

English summary
officials impose restrictions in coronavirus affected areas in vijayawada city as centre announced lock down today. official announced lock down areas in vijayawada city and request people not to come out of the areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X