వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకాకుళంలో డూప్లికేట్ సాస్‌,వెనిగర్‌ గుట్టు రట్టు; ఫిబ్రవరి తేదీతో ముందే తయారీ;ఆందోళన

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: రాష్ట్రంలో అక్కడా ఇక్కడా అని లేకుండా నకిలీ వస్తువుల తయారీ జోరుగా సాగుతోంది. అధికారులు జరిపే దాడుల్లో ఒక్కో చోట ఒక్కో రకంగా డూప్లికేట్ ప్రొడక్ట్ లు పట్టుబడుతుండటంతో ఈ నకిలీ,కల్తీ వస్తువుల జాబితా అంతకంతకు పెరుగుతోంది. తాజాగా శ్రీకాకుళంలో తయారవుతున్ననకిలీ సాస్,వెనిగర్ ల రాకెట్ గుట్టురట్టయింది.

చైనీస్ ఫుడ్, ఫాస్ట్ పుడ్ ఐటెమ్స్ లలో విరివిగా వినియోగించే సాస్, వెనిగర్ లను నకిలీ బ్రాండ్ల పేరుతో భారీ స్థాయిలో తయారు చేస్తున్న స్థావరాన్నిశ్రీకాకుళం జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. పైగా ఈ గౌడన్ లో నకిలీ ప్రొడక్ట్ ల మీద ఫిబ్రవరిలో తయారైనట్లు ముందుగానే తేదీలు ముద్రించేసి యథేచ్చగా సరుకు తరలింపులు జరుపుతుండటం గమనార్హం...

Officials seize adulterated vinegar sauce in Srikakulam

శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు అధికారుల సమాచారం ప్రకారం...విశాఖపట్నం జైల్‌రోడ్‌లోని రవీంద్రనగర్‌ ఏరియాలోని జయబాలాజీ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ అనే సంస్థ నకిలీ బ్రాండ్ల పేరుతో సాస్‌, వెనిగర్‌లను మార్కెట్లో అమ్మకాలు జరుపుతుందన్నసమాచారాన్నివిజిలెన్స్‌ అధికారులు తెలుసుకున్నారు. దీనిపై మరింత లోతుగా పరిశోధన జరిపి ఆ సరుకు వీరికి ఎక్కడి నుంచి వస్తుందన్నసమాచారాన్నికూడా సేకరించారు. శ్రీకాకుళం నగరంలోని మొండేటివీధి ప్రాంతంలో ఒక హోల్‌సేల్‌ డీలర్‌ ఈ సరుకు సప్లయి చేస్తున్నాడని తెలుసుకొని శనివారం మూకుమ్మడి దాడులు నిర్వహించి నకిలీల గుట్టు రట్టు చేశారు. అధికారులు జరిపిన తనిఖీల్లో ఓ గౌడౌన్ లో 50 టామాటా సాస్‌ బాక్సులు,
60 చిల్లీ సాస్‌ పెట్టెలు, 50 సోయా సాస్‌ పెట్టెలు, 100 వెనిగర్‌ పెట్టెలను గుర్తించారు.

నిబంధనల ప్రకారం ఈ పెట్టలపై ఉండాల్సిన అధికారిక వివరాలు, బ్యాచ్‌ సంఖ్య తదితర సమాచారం ఏదీ లేదు. తయారీ తేదీ మాత్రం ఫిబ్రవరి 2018గా అని ముందుగానే ముద్రించి ఉండటం గమనార్హం. వీటిని జిల్లావ్యాప్తంగా పలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు, హోటళ్లకూ సరఫరా చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులకు హోల్‌సేల్‌ డీలరు విచారణలో తెలిపారు. ప్రముఖ బ్లాండ్లకు చెందిన సాస్‌, వెనిగర్‌ సామగ్రితో పోలిస్తే సగం ధరకే అందిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు హోటల్‌ యజమానులు, ఫాస్ట్‌ఫుడ్‌ విక్రయదారులు ఆసక్తి చూపుతారని తెలిపారు. శనివారం నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.2 లక్షల విలువ చేసే 260 పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. వీటి నమూనాలను క్వాలిటీ పరీక్షల నిమిత్తం పంపించారు. ప్రాంతీయ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు అధికారి టి.హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో డీఎస్సీ బి.ప్రసాదరావు, సీఐలు జి.చంద్ర, కె.కృష్ణ, డీసీటీవో తారకరామారావు, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

English summary
Srikakulam vigilance officers conducted raids on an adulterated sauce, vinegar supply godown in Srikakulam on saturday and seized worth Rs. 2 lakhs duplicate products.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X