వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ కే ఏ పాలా..! న‌వ్విస్తున్నావ్ క‌దా అనుకుంటే న‌ట్లేట్లో ముంచేట్టు ఉన్నావే..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : అమ్మ K A పాల్..! నట్టేట్లో ముంచేట్టు ఉన్నావే..!! | Oneindia Telugu

అమరావతి/హైద‌రాబాద్ : కేఏ పాల్‌.. కొన్ని రోజులుగా ఆంధ్రా రాజ‌కీయాల‌ను ఊపేస్తున్నారు. కాదు కాదు.. పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తున్నారు. అలాగ‌ని రాజ‌కీయాలు దూరంగా ఉండి సినిమాల్లో వేశాలకోసం ప్ర‌త్నాలు చేస్తున్నారా అంటే అదీ కాదు. ప్ర‌త్య‌ర్థుల‌కు ధీటైన జవాబిస్తూ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేందుకు సీరియ‌స్ రాజ‌కీయాలు చేస్తున్నారు. ఆయ‌న చేష్ట‌లు, హావ‌భావాలు, ప్ర‌క‌ట‌న‌లు, పోటీ చేసే విధానం, నామినేష‌న్ ప్ర‌క్రియ‌.. ఇలా ప్రతి ఒక్క‌టీ ఆంధ్ర రాజ‌కీయాల్లో స‌గ‌టు రాజ‌కీయ ప్రేక్ష‌కుడికి వినోదాన్ని పంచుతున్నాయి. కానీ నామినేష‌న్ వేసిన అయ‌న అభ్య‌ర్థులు మాత్రం ఏపి రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నాల‌ను స్రుష్టిస్తున్నారు.

 జ‌గ‌న్‌పై పాల్ వ్యూహాత్మ‌క గురి..! పేరును పోలిన పేరుతో నామినేష‌న్..!!

జ‌గ‌న్‌పై పాల్ వ్యూహాత్మ‌క గురి..! పేరును పోలిన పేరుతో నామినేష‌న్..!!

కేఏ పాల్ హ‌స్యపుచేష్ట‌లు చేస్తూ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచినా.. వెన‌క మాత్రం పెద్ద వ్య‌వ‌హారమే న‌డిపారు. ఏకంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీని టార్గెట్ చేశారు. అదీకూడా ఎంతో వ్యూహాత్మ‌కంగా.. తెలివిగా దెబ్బ‌కొట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే వైసీపీ, ప్రజాశాంతి పార్టీ మ‌ధ్య, గుర్తుల మ‌ధ్య వివాదం నెల‌కొంది. వైసీపీ ఫ్యాన్ గుర్తు, ప్ర‌జాశాంతి పార్టీ హెలీకాప్ట‌ర్ గుర్తు ఒకేలా ఉన్నాయని, హెలీకాప్ట‌ర్ గుర్తు తొల‌గించాల‌ని వైసీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

హాస్య హావ భావాలు..! మొద‌టికే మోసం తెస్తున్న పాల్ వ్య‌వ‌హారం..!!

హాస్య హావ భావాలు..! మొద‌టికే మోసం తెస్తున్న పాల్ వ్య‌వ‌హారం..!!

తెలంగాణ ఎన్నిక‌ల్లో కారు, ట్రక్కు గుర్తు మ‌ధ్య పోలిక‌ల‌ను వివ‌రించారు. అయితే.. కేఏ పాల్ మాత్రం హెలీకాప్ట‌ర్ గుర్తు ఉండాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఎన్నిక‌ల సంఘం కూడా వైసీపీ ఫిర్యాదుల‌ను ప‌ట్టించుకోలేదు. ఇప్ప‌టికే ఈ విష‌యంలో వైసీపీ లోలోన మ‌ద‌న ప‌డుతోంది. ఫ్యాన్ గుర్తు అనుకుని ప్ర‌జ‌లు హెలీకాప్ట‌ర్ గుర్తుకు ఓటు వేస్తారేమోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఇక ఎన్నిక‌ల్లో ప్ర‌జాశాంతి పార్టీ 35 అసెంబ్లీ, 4 లోక్‌స‌భ‌ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పుడు దీనిపైనా పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది.

వామ్మో..! ఎన్నిక‌ల్లో ఇన్ని జిమ్మిక్కులా..! ఒకే పేరుతో ఇంత మంది నామినేష‌న్లా..? దేవుడా..!!వామ్మో..! ఎన్నిక‌ల్లో ఇన్ని జిమ్మిక్కులా..! ఒకే పేరుతో ఇంత మంది నామినేష‌న్లా..? దేవుడా..!!

పాల్ తెర‌వెనుక రాజ‌కీయం..! ఆశ్య‌ర్యపోతున్న వైసీపి శ్రేణులు..!!

పాల్ తెర‌వెనుక రాజ‌కీయం..! ఆశ్య‌ర్యపోతున్న వైసీపి శ్రేణులు..!!

వైసీపీ అభ్య‌ర్థుల పేర్ల‌ను పోలిన వారి పేర్ల‌తో ప్ర‌జాశాంతి పార్టీ అభ్య‌ర్థులు ఉన్న‌ట్లు వెలుగులోకి వ‌స్తోంది. కొన్ని చోట్ల అవే పేర్లు ఉండ‌గా.. మ‌రికొన్ని చోట్ల మాత్రం వైసీపీ అభ్య‌ర్థి పేరులో ఏదోఒక ప‌దం లేదా ఇంటి పేరు క‌లుస్తోంది. ఎంతో వ్యూహాత్మ‌కంగానే వైసీపీని దెబ్బ‌కొట్టాల‌నే ప్ర‌జాశాంతి పార్టీ అభ్య‌ర్థుల‌ను కేఏ పాల్ ఎంపిక చేశార‌ని భావిస్తున్నారు. ఇన్ని రోజులు ఆయ‌న తెర‌పై హాస్యం పండించినా.. తెరవెనుక చేసిన రాజ‌కీయానికి అంద‌రూ ఆశ్య‌ర్య‌పోవాల్సివ‌స్తోంది. వైసీపీ అభ్య‌ర్థ‌ల‌ను పోలిన పేర్ల‌తో ఉండ‌టంతో.. ఇద్ద‌రి పేర్లు పక్క‌ప‌క్క‌నే వ‌చ్చే అవకాశం ఉంది. దీనివ‌ల్ల ఓట‌ర్లు ఒక్కోసారి అయోమ‌యానికి గురై వైసీపీ అభ్య‌ర్థికి బ‌దులు ప్ర‌జాశాంతి పార్టీకి ఓటు వేసే అవ‌కాశం ఉంది.

 ప్ర‌జాశాంతి పార్టీ పై ఈసీకి వైసీపి ఫిర్యాదు..! పార్టీ గుర్తులో కూడా అయోమ‌య‌మే..!!

ప్ర‌జాశాంతి పార్టీ పై ఈసీకి వైసీపి ఫిర్యాదు..! పార్టీ గుర్తులో కూడా అయోమ‌య‌మే..!!

అదీగాక ఫ్యాన్ గుర్తు, హెలీకాప్ట‌ర్ గుర్తు ఒకేలా ఉన్నాయ‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. ఇలా అన్ని విష‌యాల్లో సారూప్య‌త‌లు ఉండ‌టంతో వైసీపీ ఓట్ల‌కు గండి ప‌డుతుందేమోన‌ని ఆ పార్టీ నాయ‌కులు టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని వైసీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. గ‌తంలో జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్న‌ప్పుడు కేఏ పాల్‌ను ఇబ్బందుల‌కు గురిచేశారు. ఆయ‌న‌పై అప్ప‌ట్లో ప‌లు కేసులు కూడా న‌మోద‌య్యాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే జ‌గ‌న్‌ను దెబ్బ‌తీయాల‌ని వ్యూహాత్మ‌కంగా కేఏ పాల్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది.

English summary
The average political audience in Andhra politics is entertaining. But those nominated nominees are gaining momentum in politics. prajasanthi party chief ka pal became sensational in the ap politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X