వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు..! దేశం వైపు గ‌బ్బ‌ర్ సింగ్ చూపు..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నిన్నమొన్నటి వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న టీడీపీ, జనసేన పోలింగ్‌ సమయం దగ్గరయ్యే కొద్దీ ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లకు ఫులుస్తాప్ పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీల అధినేతలు కలిసి ఇపుడు వైసీపీ అద్య‌క్షుడు జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. గ‌త వారం రోజులుగా టీడీపీ, జనసేన మధ్య పెద్దగా ఆరోపణలు, ప్రత్యారోపణలు లేవు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు జనసేనాధిపతి పవన్‌ కళ్యాణ్‌ను బహిరంగ సభల్లో మెచ్చుకోవడం చూస్తే వీరిద్దరి బంధాలు బలపడుతున్నట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తున్న టీడిపి, జ‌న‌సైన‌..! గ‌బ్బ‌ర్ సింగ్ కు కితాబులిస్తున్న బాబు..!!

జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తున్న టీడిపి, జ‌న‌సైన‌..! గ‌బ్బ‌ర్ సింగ్ కు కితాబులిస్తున్న బాబు..!!

ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్రబాబు ఏకంగా జనసేనాధిపతి పవన్‌ కళ్యాణ్‌పై ప్రసంశల జల్లుకురిపించారు. పవన్‌ కళ్యాణ్‌ ధైర్యంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ను నిలదీస్తున్నారని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారని చంద్ర‌శేఖ‌ర్ రావును ప్రశ్నిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ను మనసార అభినందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. కేసీఆర్‌ నువ్వెవ‌రూ? మా రాష్ట్రంలో జోక్యం చేసుకోవడానికి? దమ్ముంటే ఏపీకి రా నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ పవన్‌ సవాల్‌ విసిరారని చంద్రబాబు గుర్తు చేసారు. పౌరుషంగా నిలదీస్తుంటే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మాత్రం చంద్ర‌శేఖ‌ర్ రావుకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.

టీడిపి, జ‌న‌సేన ల‌క్ష్యం ఒక్క‌టే..! దారులు వేరంటున్న నేత‌లు..!!

టీడిపి, జ‌న‌సేన ల‌క్ష్యం ఒక్క‌టే..! దారులు వేరంటున్న నేత‌లు..!!

ఆంధ్రోళ్ల పెత్తనం అంటూ చంద్ర‌శేఖ‌ర్ రావు నోరుపారేసుకుంటున్నాడని , ఆంధ్రవాళ్లు దేశంలో తిరగకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఇద్దరూ కూడా జగన్‌ అవినీతి అక్రమాల మీదనే విమర్శనాస్త్రాలు సాధించడం గమనార్హం. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ విధానాల‌పై విమర్శలు సంధిస్తుంటాయి. వీటినే ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటాయి. కానీ ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెబుతున్న పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ప్రతిపక్షనేతను టార్గెట్‌ చేయడం విశేషం.

టీడిపి ని టార్గెట్ చేసిన కాట‌మ‌రాయుడు..! అక‌స్మాత్తుగా స్వ‌రం మార్చిన జ‌న‌సేనాని..!!

టీడిపి ని టార్గెట్ చేసిన కాట‌మ‌రాయుడు..! అక‌స్మాత్తుగా స్వ‌రం మార్చిన జ‌న‌సేనాని..!!

పవన్‌ కళ్యాణ్‌ నిన్నమొన్నటి వరకు మంత్రి లోకేష్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. లోకేష్‌పై మంగళగిరి నుంచి అభ్యర్ధిని నిలబెట్టలేదు. విమర్శలు రావవడంతో హడావిడిగా నామినేషన్‌కు ముందు రోజు మంగళగిరికి అభ్యర్ధిని ప్రకటించడం గమనార్హం. టీడీపీకి జనసేనా దగ్గర చేసేందుకు ఇద్దరు ప్రముఖ మీడియా అధినేతలు రంగంలో దిగినట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. వీరిద్దరూ ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడితే పవన్‌ కళ్యాణ్‌ మద్దతు టీడీపీకి ఇచ్చే విధంగా పెద్ద డీల్‌ జరిగినట్లు ప్రచారం సాగుతోంది.

భ‌విశ్య‌త్తులో టీడిపి, జ‌న‌సేన క‌లుస్తాయా..! ఆస‌క్తి క‌రంగా మారిన ఏపి రాజ‌కీయాలు..!!

భ‌విశ్య‌త్తులో టీడిపి, జ‌న‌సేన క‌లుస్తాయా..! ఆస‌క్తి క‌రంగా మారిన ఏపి రాజ‌కీయాలు..!!

ఈ పరిణామాల తరువాతనే పవన్‌ ఎన్నికల ప్రచారాన్ని ఈ రెండు పత్రికలు అనుబంధ ఛానళ్లు పోటీపడి కవర్‌ చేస్తున్నాయి. పవన్‌ వార్తలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నాయి. హైదరాబాద్‌ ఎడిషన్‌లో కూడా పవన్‌ కళ్యాణ్‌ వార్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. వాస్తవానికి వైసీపీతో జనసేనాకు పొత్తు కుదిర్చేందుకు హైదరాబాద్‌లో ఓ జాతీయ పార్టీతో పాటు తెలంగాణలోని ఓ ప్రముఖ పార్టీకి చెందిన కొందరు పెద్దలు గతంలో ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. నగరంలోని కొంపల్లిలో రెండు దఫాలుగా జరిగిన రహస్య సమావేశాల్లో పొత్తులు బెడిసి కొట్టిన‌ట్టు తెలిసింది. జనసేనతో పొత్తు విషయంపై జగన్‌ కొంత మొండిగా వ్యవహరించడంతో చర్చలు ఫలప్రదం కాలేదనే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

English summary
The heads of these two tdp and janasena parties are now being targeted the ysrcp President Jagan. There have been no allegations against TDP and Jansana for the past week. Talking about the recent developments in AP chandrababu, Pawan Kalyan, the two bonds are strengthened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X