నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాపూరు పోలీస్‌స్టేషన్‌పై స్థానికుల దాడి: ఎస్ఐ, కానిస్టేబుళ్లకు గాయాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాపూరు పోలీస్‌స్టేషన్‌పై స్థానికుల దాడి: ఎస్ఐ, కానిస్టేబుళ్లకు గాయాలు

నెల్లూరు: జిల్లాలోని రాపూరు పోలీస్‌స్టేషన్‌పై బుధవారం రాత్రి స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎస్సై లక్ష్మణ్‌ రావు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.

On Camera, Cops Beaten Up Inside Police Station In Andhra Pradesh

ఓ కేసు విచారణ విషయంలో యువకుడిని తీసుకువచ్చి కొట్టారన్న కోపంతో సదురు యువకుడి సంబంధీకులు ఈ దాడికి పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మిగతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

గాయపడిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రాంబాబు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం: ఐజీ గోపాలరావు

గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను ఐజీ గోపాలరావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసులను గాయపర్చడం సరికాదని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎస్సై పనితీరు బాగాలేదనడం అవాస్తవమని అన్నారు. రక్షణ కల్పించే పోలీసులపై దాడులు సరికాదని ఐజీ గోపాలరావు అన్నారు. దాడికి పాల్పడిన 50మందిలో 20మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.

English summary
A sub inspector and two constable were beaten up inside the police station in Andhra Pradesh's Nellore district on Wednesday evening by some people who barged inside. They were angry that the sub inspector had called in three people for questioning at the Rapuru police station and beaten them up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X