వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల ఫలితాల రోజు చంద్రబాబు దివ్యవాణితో ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎన్నికల ఫలితాల రోజు చంద్రబాబు దివ్యవాణితో ఏమన్నారంటే!! || Oneindia Telugu

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ , తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకురాలు దివ్య వాణి ఇటీవల ఏపీలో వచ్చిన ఫలితాలపై సామాన్యులు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఓ టీవీ చానల్ స్టూడియోలో తాజా రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలు తెలియజేశారు . చంద్రబాబు చాలా పరిణతి గల నాయకుడని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి ప్రత్యర్థులు చేయని ప్రయత్నమంటూ లేదని దివ్యవాణి పేర్కొన్నారు .

నేను పెద్దయ్యే సరికి మీరే సీఎంగా ఉండాలి: చంద్రబాబును కోరిన నాలుగేళ్ల బాలుడునేను పెద్దయ్యే సరికి మీరే సీఎంగా ఉండాలి: చంద్రబాబును కోరిన నాలుగేళ్ల బాలుడు

ఓ పౌరుషం ఉన్న సింహాన్ని బంధించటానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేశారన్న దివ్యవాణి

ఓ పౌరుషం ఉన్న సింహాన్ని బంధించటానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేశారన్న దివ్యవాణి

ఓ పౌరుషం ఉన్న సింహాన్ని బంధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి ఈవీఎంల వల్లో, మరెందువల్లో వచ్చినా, పైన దేవుడు చూస్తూనే ఉంటాడని దివ్యవాణి తెలిపారు. ఇక్కడ ఎవరి ప్రభుత్వం ఉన్నా పైన దేవుడి ప్రభుత్వం ఉంటుందని దివ్య వాణి పేర్కొన్నారు. ఇక్కడ జగన్ ప్రభుత్వమో, మోదీ ప్రభుత్వమో, చంద్రబాబు ప్రభుత్వమో ఉండొచ్చు గాక, పైన భగవంతుడి ప్రభుత్వానికి అందరూ దానికి లోబడి ఉండాల్సిందే, చూసే దేవుడు ఒకడున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ ఎప్పుడు నిరాధారంగా ఆరోపణలు చెయ్యలేదని 'ఈవీఎంలపై నెపం నెట్టాలనుకుంటే ఎప్పటినుంచో ఈవీఎంలపై ఆరోపణలు చేసేవాళ్లం కదా' అని అన్నారు.

ఎన్నికల ఫలితాల రోజు చంద్రబాబుతో మాట్లాడితే చాలా పరిణతితో మాట్లాడారన్న దివ్య వాణి

ఎన్నికల ఫలితాల రోజు చంద్రబాబుతో మాట్లాడితే చాలా పరిణతితో మాట్లాడారన్న దివ్య వాణి

ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం చంద్రబాబు గారిని కలిసేందుకు వెళ్లానని ఆమె చెప్పారు. ఆయన ఇంట్లోనే కూర్చుని ఉన్నారని, ఏంటన్నయ్యా ఇది? అని పరామర్శించానని ఆ సమయంలో కూడా ఆయన ఎంతో పరిణతి ప్రదర్శించారని 'మన పని మనం చేసుకుంటూ వెళదాం' అంటూ ఆయన మాట్లాడారని వెల్లడించారు. గెలుపోటములు సహజం అని పేర్కొన్నారు. సీఎంగా గెలిచిన జగన్ గారికి, కేంద్రంలో మళ్లీ ప్రధాని అయిన మోదీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు అని దివ్యవాణి పేర్కొన్నారు .

కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్రం కోసం కష్టపడిన చంద్రబాబు అంటూ దివ్యవాణి కితాబు

కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్రం కోసం కష్టపడిన చంద్రబాబు అంటూ దివ్యవాణి కితాబు

చంద్రబాబు మీద వ్యతిరేఖత లేదని వ్యతిరేఖత అభ్యర్థుల మీద వుందని దివ్యవాణి పేర్కొన్నారు. గడచిన ఐదేళ్ళు చంద్రబాబు రాష్ట్రంకోసం చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. కేంద్రం నుండి సహకారం లేకున్నా ఆయన తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి మరీ పనిచేశారని దివ్యవాణి పేర్కొన్నారు. చంద్రబాబుని చాలా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్న దివ్య వాణి ఒక క్రికెట్ మ్యాచ్ పైన చాలా శ్రద్ధ తీసుకునే మనం అంతే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించటంపై ఎందుకు శ్రద్ధ తీసుకోవటం లేదో ఆలోచించుకోవాలని ఆమె అన్నారు.

English summary
The Telugu Desam Party Fire Brand, Divya Vani recently said that the common people were also shocked by the results of the recent AP. TDP Women's Leader DivyaVani in a TV channel showcasing the latest political situation in the state. Chandrababu is a very mature leader, "she said. There is so many attempts to make opponents to defeat TDP in this election.She said she had gone to meet Chandrababu on the evening of the election results. He's sitting at home, and That he was very mature at the time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X