అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూన్ 8..కీల‌క నిర్ణ‌యాల‌కు జ‌గ‌న్ ముహూర్తం: ఆ రోజు ఏం చేయ‌బోతున్నారు: ఎందుకీ ఆస‌క్తి..!

|
Google Oneindia TeluguNews

ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జూన్ 8 రాజ‌కీయంగా కీలక‌మైన రోజు. ఆ రోజే జ‌గ‌న్ అనేక ముఖ్య‌మైన నిర్ణ‌యాల‌కు ముహూర్తంగా నిర్ణ‌యించారు. అదే రోజు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తో పాటుగా తొలి సారిగా ముఖ్య‌మంత్రి హోదాలో ఏపీ స‌చివాల‌యంలో అడుగు పెట్ట‌బోతున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సైతం స‌చివాల‌యం ప‌క్క‌నే ఖాళీ స్థ‌లంలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, అదే రోజు జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న తొలి కేబినె్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఇక‌, అదే రోజున జ‌గ‌న్ కేబినెట్ స‌మావేశంలో గ‌త టీడీపీ పాల‌న‌లోని లోపాల‌పైన కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది.

స‌చివాల‌యంలోకి గ్రాండ్ ఎంట్రీ..
ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌గ‌న్ తొలి సారిగా జూన్ 8న ఏపీ స‌చివాల‌యంలోకి అడుగు పెట్ట‌నున్నారు. ఉద‌యం 8.39 గంట‌ల‌కు స‌చివాల‌యంలోని సీఎం ఛాంబ‌ర్‌లో కాలు పెట్ట‌నున్నారు. వాస్త‌వంగా ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాతి రోజు నుండే స‌చివాల‌యానికి వెళ్లాల‌ని భావించినా.. ముహూర్తం కుద‌ర‌క పోవ‌టంతో వాయిదా ప‌డింది. దీంతో...ముందుగా అధికారుల నియామ‌కం.. త‌న కార్యాల‌య సిబ్బంది ని నియ‌మించుకోవ‌టం..స‌మీక్ష‌లు చేయ‌టం ప్రారంభిస్తున్నారు. ఇప్ప‌టికే స‌చివాల‌య ఉద్యోగ సంఘాలు నూత‌న ముఖ్య‌మంత్రికి ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు ఎదురు చూస్తున్నారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ఇప్ప‌టికే వాస్తు మార్పుల‌తో పాటుగా..చిన్న‌పాటి మ‌ర‌మ్మ‌త్తులు చేయిస్తున్నారు. చంద్ర‌బాబు వ‌ద్ద ప‌ని చేసిన అధికారులు..కాంట్రాక్టు సిబ్బందిని త‌ప్పిస్తూ ఇప్ప‌టికే ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. కొత్త అధికారుల నియామ‌కం ప్రారంభ‌మైంది.

on june 8th jagan decided to enter secretariat and expand cabinet expansion and attend first cabinet meet

8న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌..కేబినెట్ స‌మావేశం
జ‌గ‌న్ స‌చివాల‌యంలో ఎంట్రీ ఇచ్చే రోజునే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సైతం నిర్ణ‌యించారు. స‌చివాల‌యం ప‌క్క‌నే గ‌తంలో చంద్ర‌బాబు కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టిన ప్ర‌దేశంలోనే జూన్ 8న కేబినెట్ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. దీని కోసం ఇప్ప‌టికే సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఏర్పాట్లు మొద‌లు పెట్టింది. మంత్రుల పేషీలు సైతం సిద్దం చేస్తున్నారు. ప్ర‌తీ పేషీలో ఇప్పటి వ‌ర‌కు ఉన్న చంద్ర‌బాబు ఫొటోల‌ను తొలిగించి జ‌గ‌న్ ఫొటోల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజు కేబినెట్ తొలి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అందులో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. రాజ‌ధాని భూముల విష‌యంతో పాటుగా పోల‌వ‌రం..గ‌త ప్ర‌భుత్వంలో అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన కాంట్రాక్టుల ర‌ద్దు పైనా నిర్ణ‌యం తీసుకోనున్నారు. అదే విధంగా పెన్ష‌న్ల పెంపు నిర్ణ‌యం పైనా రాటిఫికేష‌న్ చేయ‌నున్నారు. ఇక‌, అసెంబ్లీ స‌మావేశాల‌ను జూన్ 12 నిర్వ‌హించాల‌ని భావిస్తున్న జ‌గ‌న్ దీని పైనా కేబినెట్‌లో చ‌ర్చంచి నిర్ణ‌యం తీసుకోనున్నారు.

English summary
June 8th is becoming crucial for AP CM jagan. On that day jagan decided to expand cabinet expansion and attend first cabinet meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X