• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రామరాజ్యానికి పునాది..సరయూ తీరంలో భారతీయ ఏకాత్మత: తెలుగు నేతల భావోద్వేగం

|

అమరావతి: ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో మహాద్భుత ఘట్టం మరి కొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. అపురూపమైన రామమందిరం నిర్మాణానికి పునాదిరాయి పడబోతోంది. భవ్య రామమందిరం నిర్మాణానికి భూమిపూజను నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు తొలి ఇటుక వేసి.. శిలాన్యాస్ చేయనున్నారు. ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.

Ayodhya:ప్రధాని మోడీ అయోధ్య టూర్ షెడ్యూల్ ఇదే.. ప్రత్యేక ఆహ్వానితుల్లో చిన్నజీయర్ స్వామి

ప్రముఖుల శుభాకాంక్షలు..

ఏపీ నుంచి కొందరు రాజకీయ నేతలు, ప్రముఖులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ నిర్మాణం శరవేగంగా కొనసాగాలని అకాంక్షిస్తున్నారు. రామమందిరం నిర్మాణం.. రామరాజ్యానికి పునాది కావాలంటూ అభిలాషిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు, ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు, మన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచైత గజపతి రాజు ట్వీట్ల ద్వారా తమ శుభాకాంక్షలను తెలిపారు.

రామమందిరం నిర్మాణంతో కష్టాల చీకట్లు తొలగుతాయంటూ..

మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి జన్మస్థలం సరయు నది తీరాన వెలిసిన అయోధ్య నగరంలో శ్రీరామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ ఏపీ బీజేపీ తరఫున శుభాకాంక్షలను తెలుపుతున్నట్లు సోము వీర్రాజు చెప్పారు. రామమందిరం నిర్మాణంతో దేశం ఇకపై ఎలాంటి ఇక్కట్లను ఎదుర్కొనబోదని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. రామమందిరం ఆలయం శరవేగంగా పూర్తి కావాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయోధ్యలో చారిత్రక దృశ్యం ఆవిష్కారం..

ఏపీ నుంచి కొందరు రాజకీయ నేతలు, ప్రముఖులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ నిర్మాణం శరవేగంగా కొనసాగాలని అకాంక్షిస్తున్నారు. రామమందిరం నిర్మాణం.. రామరాజ్యానికి పునాది కావాలంటూ అభిలాషిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు, ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు, మన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచైత గజపతి రాజు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే టీ రాజాసింగ్ ట్వీట్ల ద్వారా తమ శుభాకాంక్షలను తెలిపారు.

కష్టాలు.. పటాపంచలు..

కోట్లాది మంది భారతీయుల నమ్మకానికి ప్రతీక అయిన శ్రీరామచంద్రుని భవ్య మందిర నిర్మాణ భూమిపూజ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలను తెలుపుతున్నట్లు బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ చెప్పారు. హిందువుల చిరకాల అకాంక్షలు నెరవేరబోతున్నాయని అన్నారు. రామమందిరం నిర్మితం కావాలనేది కోట్లాదిమంది కలలు కన్నారని పేర్కొన్నారు. ఇకపై దేశ ప్రజల ఎదుర్కొంటోన్న ఇబ్బందులు పటాపంచలు కావాలని తాను శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

రామరాజ్యానికి పునాది కావాలి..

రామమందిర నిర్మాణం.. రామరాజ్యానికి పునాది కావాలని అకాంక్షిస్తున్నట్లు మన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త సంచైతా గజపతి రాజు అన్నారు. ఎన్నో ఏళ్లుగా హిందువులు రామమందిరం కోసం కలలు కన్నారని, అవన్ని ఇప్పుడు సాకారం అవుతున్నాయని చెప్పారు. రామమందిరాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శంచుకోవాలని ఆమె అన్నారు. రామమందిరం నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అయోధ్య రాముడు ఆనందించేలా..

అయోధ్య రాముడు ఆనందించేలా రామమందిరం నిర్మాణానికి భూమిపూజ చేయబోతుండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబు చెప్పారు. దేశం గర్వించేలా, ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా ఆలయం నిర్మితం కావాలని కోరారు. ఎదురులేని, తిరుగులేని, మొక్కవోని సాహసంతో ఆలయాన్ని నిర్మించాలనే పుణ్యకార్యాన్ని తలపెట్టిన వారికి తాను అభినందనలను తెలియజేస్తున్నానని చెప్పారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. జై శ్రీరామ్ అంటూ ఏకవాక్యంతో ట్వీట్ చేశారు. ప్రధాని మోడీతో తాను దిగిన ఫొటో, రామమందిరం నమూనాతో కూడిన ఓ గ్రాఫిక్ వీడియో క్లిప్‌ను దానికి జత చేశారు.

English summary
On the occassion of Ram Mandir Bhumi Pujan at Ayodhya, Bharatiya Janata Party Andhra Pradesh President Somu Veerraju, MLC PVN Madhav and other leader sent best wishes to Sri Ram Janmabhoomi Teertha Kshetra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X