• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయ‌స్ ఆప్త‌మిత్రుడుకు విజ‌య‌మ్మ అరుదైన గిఫ్ట్‌: భావోద్వేగంతో ఆ డాక్ట‌ర్ ఇలా: ఏంటా గిప్ట్‌..!

|

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్సార్ జ‌న్మ‌దినం. ఈ సంద‌ర్భంగా వైయ‌స్సార్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ ఒక అరుదైన బ‌హుమానం త‌న భ‌ర్త మిత్రుడుకు పంపించారు. దానిని చూడగానే ఆ ఆప్త‌మిత్రుడు భావోద్వేగానికి గుర‌య్యారు. ఆ బ‌హుమ‌తి ని తదేకంగా చూస్తూ త‌న మిత్రుడు వైయ‌స్సార్‌ను మ‌రో సారి గుర్తు చేసుకున్నారు. 1976 నుండి వైయ‌స్‌తో అత్యంత స‌న్నిహితుడుగా ఉంటున్న ఆయ‌న‌కు..ఇప్పుడు వైయ‌స్ లేక‌పోయినా ఆయ‌న స‌తీమ‌ణి గుర్తు పెట్టుకొని మ‌రీ త‌న‌కు ఆ బ‌హుమ‌తి పంప‌టం పైన ఆయ‌న సంతోషం ప‌ట్ట‌లేక‌పోయారు. ఇప్పుడు అదే అంశం వైసీపీలో ప్ర‌తీ ఒక్క‌రూ ఆస‌క్తిగా చెప్పుకుంటున్నారు. ఇంత‌కీ..ఆ బ‌హుమ‌తి అందుకున్న‌ది ఎవ‌రు..ఏంటా బ‌హుమ‌తి..

వైయ‌స్ మిత్రుడు జ‌న్మ‌దినం నాడు..

వైయ‌స్ మిత్రుడు జ‌న్మ‌దినం నాడు..

దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్సార్ ఆప్త మిత్రుడు కేవిపి అయితే మ‌రో స‌న్నిహితుడు డాక్ట‌ర్ దుట్టా రామ‌చంద్రా రావు. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన ఆయ‌న వైయస్సార్‌కు ఆప్త మిత్రుడు. ఆయ‌న సైతం వైద్యుడే. వై య‌స్ తో క‌లిసి గుల్బ‌ర్గాలో మెడిసిన్ విద్య పూర్తి చేసారు. అప్ప‌టి నుండి ఇద్ద‌రు మిత్రులుగా ఉన్నారు. వైయ‌స్ మ‌ర ణం త‌రువాత ఆయ‌న జ‌గ‌న్‌తో క‌లిసి రాజ‌కీయాల్లో కొన‌సాగారు. 2014లో వైసీపీ నుండి గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌లేదు. ప్ర‌స్తుతం చెందిన వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. అయితే, ఈ నెల 8వ తేదీన వైయ‌స్సార్ జ‌న్మ‌దినం పుర‌స్క‌రించుకొని విజ‌య‌మ్మ ఒక బ‌హుమతిని పంపించారు. అది చూడగానే దుట్టా రామ‌చంద్ర‌రావు తో పాటుగా ఆయ‌న కుటుంబ స‌భ్యులు సంతోషంలో మునిగిపోయారు.

  వైఎస్సార్ జయంతి నాడే "రైతు బీమా పథకం" ప్రారంభం : కన్నబాబు
  ఆ బ‌హుమానం చూడ‌గానే భావోద్వేగం..

  ఆ బ‌హుమానం చూడ‌గానే భావోద్వేగం..

  డాక్టర్‌ దుట్టా రామచంద్రరావును వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన విజ‌య‌మ్మ అరుదైన కానుకతో గౌరవించించారు. 1976 నుంచి వైఎస్సార్‌తో దుట్టాకు ఉన్న సాన్నిహిత్యాన్ని మరోమారు గుర్తుసుకుంటూ విజయమ్మ ఈ బహుమతిని పంపించారు. వైఎస్సార్‌ జ్ఞాపకంగా ఆయన ధరించిన దుస్తులను డాక్టర్‌ దుట్టాకు బహుమతిగా అందజేశారు. వైఎస్సార్‌ 70వ జయంతి సందర్భంగా ప్రాణమిత్రుడు వేసుకున్న వస్త్రాలను తన చేతితో తడుముతూ దుట్టా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్‌ ఉన్నంతకాలం తమ స్నేహానికి ఎంతో విలువ ఇచ్చారని, ఆయన మరణానంతరం కూడా ఆ కుటుంబం తనకు ఎంతో గౌరవాన్ని ఇస్తోందని దుట్టా గుర్తు చేసుకున్నారు. అదే స‌మ‌యం లో దుట్టా రామ‌చంద్రరావు తాజా ఎన్నిక‌ల స‌మ‌యంలో గ‌న్న‌వ‌రం నుండి పోటీ చేయ‌లేదు. ఆయ‌న స్థానంలో ఎన్నారై వెంక‌ట్రావుకు పార్టీ అధినేత టిక్కెట్ ఖ‌రారు చేసారు. రామ‌చంద్ర‌రావుకు పార్టీలో కీల‌క స్థానం కట్ట‌బెట్టారు.

  పార్టీలో ఇదే అంశం పైన చ‌ర్చ‌...

  పార్టీలో ఇదే అంశం పైన చ‌ర్చ‌...

  వైయ‌స్ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌రువాత ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ప‌డింది. రాజ‌కీయంగా..ఆర్దికంగా న‌ష్ట‌పోయింది. జ‌గ‌న్ ఇప్పుడు ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత వైయ‌స్ తొలి జ‌న్మ‌దినం కావ‌టంతో కుటుంబం మొత్తం ఇడుపుల పాయ‌లోనే వైయ‌స్‌కు నివాళి అర్పించేందుకు అంద‌రూ ఒకే చోట‌కు చేరుకున్నారు. ఇక‌, త‌న కుమారుడు సీఎం కావ‌టంతో..విజ‌య‌మ్మ సైతం చాలా కాలం త‌రువాత వైయ‌స్ జ‌న్మ‌దినం నాడు సంతోషంగా క‌నిపించార‌ని వైసీపీ నేత లు గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సంద‌ర్భంలో డాక్ట‌ర్ దుట్టా రామ‌చంద్రరావును గుర్తు పెట్టుకొని విజ‌య‌మ్మ బ‌హుమ‌తి పంప‌టం పైనా పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

  English summary
  On YSR birth day occasion his wife Vijayamma sent a gift to her husband close friend. YSR clothes send as gift for Dr Dutta Ramachandra Rao. With this gift Dr family felt very happy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X