• search
 • Live TV
హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బాలయ్య మారలే ! నువ్వు గెలుస్తావన్నోన్ని కూడా బూతులు తిట్టాడు !

|
  AP Assembly Elections 2019 : మరోసారి నోరు జారిన బాలయ్య || Oneindia Telugu

  హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం లో హల్ చల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఛానల్ కు చెందిన వీడియో గ్రాఫర్ ను కొట్టిన బాలయ్య ఆ వివాదం సమసేలోపే మరో వివాదం సృష్టించారు. బాలయ్య ఎన్నికల ప్రచారంలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి నోరు జారారు.

  ఎన్టీఆర్ "శాపం" ఈ ఎన్నికల్లో ఫలించబోతోంది ! జోస్యం చెప్పిన మోహన్ బాబు

  సొంత పార్టీ కార్యకర్తలనే బండ బూతులు తిట్టిన బాలయ్య

  సొంత పార్టీ కార్యకర్తలనే బండ బూతులు తిట్టిన బాలయ్య

  పట్టుమని వారం రోజులు కూడా పోలింగ్ కు లేదు. ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో మీకు మెజార్టీ పెరుగుతుంది సర్ అంటూ.. అభిమానులు ఆయనను ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తే... బాలయ్య అర్ధం చేసుకోకుండా మూర్ఖంగా వారిని మాత్రం తిట్టిపోసారు.

  కార్యకర్తలు అన్నదొకటి .. బాలయ్య అర్ధం చేసుకుంది వేరొకటి

  కార్యకర్తలు అన్నదొకటి .. బాలయ్య అర్ధం చేసుకుంది వేరొకటి

  ఇక అసలు విషయానికి వస్తే .. బాలయ్య తన భార్య వసుంధరతో కలిసి హిందూపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు బాలయ్య . ఈ క్రమంలో ఈ సారి ఎన్నికల్లో 60వేలు, 70వేలు మెజార్టీ రావడం పక్కా అంటూ అభిమానులు ఆయనతో అన్నారు. వాళ్ళు అన్నది కేవలం 60, 70 వేల ఓట్లు మాత్రమే వస్తాయని అన్నట్టుగా తీసుకుని అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఆగ్రహంలో నోరు జారిన బాలయ్య ... పీక కోస్తా నా కొడకా అంటూ ఫైర్

  ఆగ్రహంలో నోరు జారిన బాలయ్య ... పీక కోస్తా నా కొడకా అంటూ ఫైర్

  గెలవడమే కష్టంగా ఉందని, వేలు లక్షల మెజారిటీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బాలకృష్ణ మండిపాటుకు గురయ్యారు. . మరో కార్యకర్త సర్‌ 60 వేలు, 70 వేలు మెజారిటీ సర్‌ అంటూ అరవడంతో.. అరే, నీ పేరు అడ్రస్‌ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపడదొబ్బుతా అంటూ అనరాని మాటలు అన్నారు. దీంతో అవాక్కవ్వటం అక్కడ ఉన్న సొంత పార్టీ నేతల వంతు అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

  ఇటీవల వీడియో జర్నలిస్ట్ పై దాడి ..క్షమాపణ చెప్పిన బాలయ్య

  ఇటీవల వీడియో జర్నలిస్ట్ పై దాడి ..క్షమాపణ చెప్పిన బాలయ్య

  మొన్నటికి మొన్న బాలకృష్ణ తన ప్రచారంలో కొందరు పిల్లలు కాన్వాయ్‌కు అడ్డుగా రావడంతో.. బాలయ్య సెక్యురిటీ సిబ్బంది వారిని పక్కకు లాక్కెళ్లారట. ఈ సీన్‌ను ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి వీడియో తీశాడు. దీనిని గమనించిన బాలయ్య అతనిపై చేయి చేసుకున్నారు. వీడియో జర్నలిస్టుపై చేయి చేసుకున్న సినీ హీరో, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. బాలయ్య తీరుపై విమర్శలు రావడంతో తన తప్పును గ్రహించారు. సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని.. మీడియా మిత్రులకు బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నానన్నారు బాలయ్య. ఇప్పుడు మరో మారు నోరు జారి బాలయ్య ఇరకాటంలో పడ్డారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  lok-sabha-home

  English summary
  The political heat peaks in the AP now. In the Hindupuram Balayya has campaigning aggressively . Balayya has recently made sensational comments and fired in his election campaign on his own party workers. Balakrishna was blamed for talking about votes when they spoke about the majority in the Hindupuram polls. Balakrishna used Abusive language on their own party cadre.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X

  Loksabha Results

  PartyLWT
  BJP+27376349
  CONG+771289
  OTH986104

  Arunachal Pradesh

  PartyLWT
  BJP20020
  CONG000
  OTH707

  Sikkim

  PartyLWT
  SDF11011
  SKM808
  OTH000

  Odisha

  PartyLWT
  BJD1070107
  BJP26026
  OTH13013

  Andhra Pradesh

  PartyLWT
  YSRCP13812150
  TDP23023
  OTH202

  TRAILING

  Ram Kripal Yadav - BJP
  Pataliputra
  TRAILING
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more