హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీకి సిగ్గు శరం ఉంటే నా తిట్లకు సముద్రంలో దూకాలి .. మరోమారు బాలయ్య తిట్ల దండకం

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : మోడీకి సిగ్గు శరం ఉంటే నా తిట్లకు సముద్రంలో దూకాలి : బాలయ్య || Oneindia

హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు ఏమైందో గానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, తిడుతున్న తిట్లు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం లో బాలకృష్ణ రోజుకో రగడ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఛానల్ కు చెందిన వీడియో గ్రాఫర్ ను కొట్టిన బాలయ్య ఆ వివాదం సమసేలోపే మరో వివాదం సృష్టించారు. పీక్ కోస్తా .. నా కొడకా , ఏసిపడదొబ్బుతా అంటూ సొంత పార్టీ కార్యకర్తనే నానా బూతులు తిట్టిన బాలయ్య ఈ సారి ఏకంగా మోడీనే టార్గెట్ చేశారు. నోటికి వచ్చినట్టు మోడీని తిట్టిన ఆయన మోడీకి సిగ్గూ, శరం ఉంటే.. నిజంగా మగాడే అయితే నేను తిట్టే తిట్లకు సముద్రంలో దూకి చావాలి అని బాలయ్య అన్నారు.ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు వింటున్న హిందూపురం నియోజకవర్గ ప్రజలు విస్తు పోతుంటే, బీజేపీ నాయకులు మాత్రం భగ్గుమంటున్నారు.

ప్రధాని మోడీనే బండ బూతులు తిట్టిన బాలయ్య

ప్రధాని మోడీనే బండ బూతులు తిట్టిన బాలయ్య

పట్టుమని నాలుగు రోజులు కూడా పోలింగ్ కు లేదు. ఈ సమయంలో బాలయ్య ప్రచారంలో తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏకంగా ప్రధాని మోడీనే బండ బూతులు తిట్టారు. మోడీకి సిగ్గూ, శరం ఉంటే.. నిజంగా మగాడే అయితే నేను తిట్టే తిట్లకు సముద్రంలో దూకి చావాలి అని బాలయ్య అన్నారు. ఇప్పుడే కాదు, మోడీని ఇంతకుముందు కూడా తీవ్రస్థాయిలో తిట్టానని, అయినా ఆయనకు సిగ్గూ, శరంలేవని బాలయ్య చెప్పారు. మోడీని నేను తిట్టినట్టు దేశంలో ఎవరూ తిట్టి ఉండరు అని గొప్పగా చెప్పుకున్నారు బాలకృష్ణ . మోడీ, కేసీఆర్ , జగన్ తో కలిసి రాష్ట్రాన్ని నాశనం చెయ్యాలని కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బాలయ్య .

వీడియో గ్రాఫర్ ను కొట్టి వివాదం , మొన్న సొంత పార్టీ కార్యకర్తనే తిట్టిన బాలయ్య

వీడియో గ్రాఫర్ ను కొట్టి వివాదం , మొన్న సొంత పార్టీ కార్యకర్తనే తిట్టిన బాలయ్య

మొన్నటికిమొన్న ఈ సారి ఎన్నికల్లో 60వేలు, 70వేలు మెజార్టీ రావడం పక్కా అంటూ అభిమానులు ఆయనతో అన్నారు. వాళ్ళు అన్నది కేవలం 60, 70 వేల ఓట్లు మాత్రమే వస్తాయని అన్నట్టుగా తీసుకుని అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అరే, నీ పేరు అడ్రస్‌ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపడదొబ్బుతా అంటూ అనరాని మాటలు అన్నారు. దీంతో అవాక్కవ్వటం అక్కడ ఉన్న సొంత పార్టీ నేతల వంతు అయ్యింది. అంతకు ముందు బాలకృష్ణ తన ప్రచారంలో కొందరు పిల్లలు కాన్వాయ్‌కు అడ్డుగా రావడంతో.. బాలయ్య సెక్యురిటీ సిబ్బంది వారిని పక్కకు లాక్కెళ్లారట. ఈ సీన్‌ను ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి వీడియో తీశాడు. దీనిని గమనించిన బాలయ్య అతనిపై చేయి చేసుకున్నారు. వీడియో జర్నలిస్టుపై చేయి చేసుకున్న బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. బాలయ్య తీరుపై విమర్శలు రావడంతో తన తప్పును గ్రహించారు. సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదని.. మీడియా మిత్రులకు బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నానన్నారు బాలయ్య.

చంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూసేశాం .. అమిత్ షా సంచలనంచంద్రబాబుకు ఎన్డీయే ద్వారాలు శాశ్వతంగా మూసేశాం .. అమిత్ షా సంచలనం

జగన్ , మోడీలపై తిట్ల దండకం అందుకున్న బాలయ్య

జగన్ , మోడీలపై తిట్ల దండకం అందుకున్న బాలయ్య

గతంలో ఓసారి బాలకృష్ణ హిందీలో మోడీపై తీవ్ర విమర్శలు చేశారు . ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ప్రధానిని తిట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్ పైనా బాలయ్య విమర్శలు చేశారు. కేసీఆర్, జగన్ లతో కలిసి రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి మోడీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వారు ముగ్గురూ కలిసి వచ్చినా తననేమీ చేయలేరని అన్నారు. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయంటే అది చంద్రబాబు చలవేనన్న బాలయ్య రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని.. విశాఖకు వెళ్లి ప్రచారం చేస్తానని బాలకృష్ణ వెల్లడించారు. హిందూపురంలోని శ్రీకంఠపురం, లక్ష్మీపురంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బాలయ్య వ్యాఖ్యలపై భగ్గుమంటున్న బీజేపీ నేతలు

బాలయ్య వ్యాఖ్యలపై భగ్గుమంటున్న బీజేపీ నేతలు

రోజుకో వివాదం సృష్టిస్తున్న బాలకృష్ణ తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. దేశ ప్రధానిని అంత మాట అంటారా అని బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాలయ్య మాటలను ఖండించారు. బాలయ్యపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ ప్రధానిని నోటికి వచ్చినట్టు తిట్టి మరో వివాదం సృష్టించారు బాలయ్య .

English summary
political heat peaks in the AP now. In the Hindupuram Balayya has campaigning aggressively . Balayya has recently made sensational comments on modi , and fired on him with abusive language . Balakrishna was blamed Modi, Jagan and KCR's friendship in this election . recently Balakrishna used Abusive language on their own party cadre. and now on PM Modi .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X