గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో మరోసారి ఐటీ సోదాల కలకలం...గుంటూరు జిల్లాలో ఉదయం నుంచి తనిఖీలు

|
Google Oneindia TeluguNews

గుంటూరు:ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గుంటూరు జిల్లాలో సోమవారం తెల్లవారుఝాము నుంచే ఐటీ అధికారులు తనిఖీలు మొదలు పెట్టారని తెలిసింది.

గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపారి, టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ఇళ్లు, కార్యాయాల్లో ఐటి అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు తమ పార్టీ నేతల ఇళ్లే లక్ష్యంగా ఐటి దాడులు జరుగుతున్నట్లు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

Once again IT raids in Andhra Pradesh

ఇటీవలి కాలంలో వివిధ సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో వరుస దాడులతో కలకలం రేపిన ఐటి శాఖ ఎపిలో మరోసారి సోదాలు చేపట్టడం కలకలం రేపుతోంది. గతంలో సోదాల్లో భాగంగా గుంటూరు జిల్లాలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుఝామున స్థానిక టిడిపి నేత, ప్రముఖ వ్యాపారి, ఎల్వీఆర్‌ క్లబ్‌ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర(నాని) ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

రవీంద్ర ఇల్లు, కార్యాలయంతో పాటు అతిథి గృహంలోనూ సోదాలు చేస్తున్నారు.వేకువఝామునే 3 కార్లలో లక్ష్మీపురం వచ్చిన ఐటీ అధికారులు రవీంద్రకు చెందిన పలు దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిసింది. రవీంద్ర గ్యాస్‌, పెట్రోల్‌ బంకులు నిర్వాహకుడిగా స్థానికులకు సుపరిచితం.

కలకలం:విశాఖ మన్యంలో మళ్లీ మావోయిస్టుల పోస్టర్లు...టిడిపి కలకలం:విశాఖ మన్యంలో మళ్లీ మావోయిస్టుల పోస్టర్లు...టిడిపి

అయితే తాజాగా ఏకంగా టీడీపీ నేతలు, మద్దతుదారుల నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా ఐటి అధికారులు తనిఖీలు చేపట్టినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో ఐటి శాఖ సోదాలు కేవలం ఒకరితో పరిమితం కాకుండా సాయంత్రంలోపు మరొకొందరు టీడీపీ మద్దతుదారులపై జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

English summary
Guntur:In Andhra Pradesh, once again, IT raids creating is creating sensation. It was reported that IT officials had initiated inspections early on Monday morning in Guntur district. IT officials are searching at the prominent businessman and TDP leader in Guntur city of Kovelamudi Ravindra House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X