• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒకప్పుడు వైఎస్‌ఆర్ కు వీర విధేయుడు...మరిప్పుడు సైకిలెక్కడం ఖాయం అంటున్నారు...

|

విశాఖపట్టణం: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖ పట్నంలో ఆ పార్టీ కి సబ్బం హరి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ లా ఉండేవారు. కారణం ఆయన వైఎస్ఆర్ అనుంగు శిష్యుడు...అంతేకాదు వైఎస్ ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగానని స్వయంగా సబ్బంహరే చెప్పుకునేవారు...

అందుకే కొంతకాలం అక్కడ సబ్బంహరి మాట వేదవాక్కులా సాగింది. ఆ తరువాత చాలా పరిణామాలు సంభవించాయి...మరి ఇప్పుడు సబ్బంహరి పరిస్థితి ఏంటి?...సబ్బంహరి ఏం చేస్తున్నారు? ఏం చెయ్యబోతున్నారు?...ఇప్పుడు తెలుసుకుందాం..

విశాఖ మేయర్ నుంచి అనకాపల్లి ఎంపి దాకా సబ్బం హరి ఎదగడం వెనుక మేయర్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎదగడం వెనుక ఆయన వ్యక్తిగత కృషితో పాటు ఆనాటి కాంగ్రెస్ ముఖ్య నేత వైఎస్ఆర్ అండదండలు కూడా కారణమని అందరికి తెలిసిన సంగతే. అయితే వైఎస్ హఠాన్మరణం సబ్బంహరి ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తరువాత రాష్ట్ర విభజన ఖంగు తినిపించింది. అందుకే రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ పార్టీని వదిలేశారు.

 కాంగ్రెస్ తరువాత...

కాంగ్రెస్ తరువాత...

సబ్బంహరి కాంగ్రెస్ ను వీడిన తరువాత వైఎస్ తనయుడు వైఎస్ జగన్ పెట్టిన వైఎస్సార్‌సీపీలో చేరారు. కొంత కాలానికి జగన్, సబ్బం హరి మధ్య‌ కొన్ని విషయాల్లో మనస్పర్థలు రావడంతో ఆ పార్టీని కూడా వదిలేశారు. అయితే వైసీపీని వీడిన తర్వాత సబ్బం హరి ఏ పార్టీలో చేరతారనే విషయం పై క్లారిటీ లేకుండా పోయింది. ఒకానొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కి దగ్గరైన సబ్బం హరి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా మిన్నకున్నారు. మరి ఇప్పుడు తన రాజకీయ పయనం గురించి సబ్బం హరి స్పష్టత ఇవ్వదలుచుకున్నారని తెలుస్తోంది.

  TDP leaders unhappy with Party Chief హరికృష్ణ ఎఫెక్ట్: బాబుపై అసంతృప్తి '
   మరి ఏం చెయ్యబోతున్నారు?

  మరి ఏం చెయ్యబోతున్నారు?

  అయితే ఇప్పుడు సబ్బం హరి రాజకీయ అడుగుల పయనంపై కొంత స్పష్టత కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సబ్బంహరి రాజకీయ పయనమెటు అనే విషయమై విశ్లేషిస్తే ఆయన మళ్లీ కాంగ్రెస్, వైసీపీలో చేరే అవకాశం లేదు. సో...మిగిలిన ఆల్టర్నేటివ్...బీజేపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీని సెలక్ట్ చేసుకోవడం...

   లోతుగా అధ్యయనం...

  లోతుగా అధ్యయనం...

  ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను అధ్యయనం చేస్తే సబ్బంహరి రాజకీయ అడుగులు ఎటు అనే విషయంపై ఈజీగానే ఒక స్పష్టత వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చాలాకాలంగా సైలెంట్ గాఉన్న సబ్బం హరి నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మొదటిసారి పెదవి విప్పారు. ఆ తరువాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తరువాత మరోసారి మాట్లాడారు. ఆ రెండు సందర్భాల్లో చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం, రాజకీయ చతురత పనిచేశాయని ఏకంగా ఆయన మీడియా ముందే చెప్పడం విశేషం.

   ఒకప్పుడు...మరిప్పుడు

  ఒకప్పుడు...మరిప్పుడు

  ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర‌ విధేయుడిగా ఉండి..జగన్ జైలుకు వెళ్లినపుడు పార్టీకి, ఆయన కుటుంబ సభ్యులకు అండదండగా నిలుస్తూ ధైర్యం చెప్పిన సబ్బం హరి ఒకానొక సందర్భంలో టిడిపి తో వైరం వ్యక్తిగతంగా భావించేంతవరకు వెళ్లింది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు...శాశ్వత శత్రువులు ఉండరన్ననానుడిని అక్షరాలా నిజం చేస్తూ సబ్బంహరి అందరికి ఒక షాక్ ఇవ్వబోతున్నారనేది తాజా టాక్. తద్వారా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వైఎస్ జగన్ కి ఒక ఝలక్ ఇవ్వబోతున్నారనే పుకార్లు జోరుగా షికార్లు చేస్తున్నాయి.

   ఏం చెయ్యబోతున్నారు...

  ఏం చెయ్యబోతున్నారు...

  సబ్బం హరి త్వరలోనే టీడీపి తీర్థం పుచ్చుకోబోతున్నారని విశ్వసనీయమైన సమాచారం. ఇదే విషయమై ఇటీవలే కొందరు టీడీపీ నేతలు సబ్బం హరితో సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సబ్బం హరి రాకను స్వాగతిస్తున్నట్లు తెలిసింది.

  సబ్బం హరి రాకతో విశాఖలో పార్టీ మరింత బలం పెంచుకుంటుందని చంద్రబాబు భావిస్తున్నారట.ఆయ‌న‌కు అన‌కాప‌ల్లి ఎంపీ సీటు ఇస్తాన‌ని కూడా బాబు హామీ ఇచ్చిన‌ట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే సబ్బం హరి టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.

  అదే జరిగితే...

  అదే జరిగితే...

  సబ్బం హరి టిడిపిలో చేరిక అంటూ జరిగితే టిడిపికి ఎంత లాభిస్తుందో తెలియదు కాని వైసిపిని మాత్రం పెద్ద దెబ్బే తీస్తుంది. సబ్బంహరి ఏ పార్టీలో చేరకుండా అలా ఉన్నా ఫర్వాలేదు కానీ అతడు టిడిపిలో చేరితే వ్యక్తిగతంగాను, సామాజికపరంగాను వైసిపికి దెబ్బేనని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. కానీ రాజకీయ విలువల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే మిన్నగా మారిపోయిన నేటి పొలిటికల్ గేమ్ లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చనేది ఈ మధ్యకాలంలో కళ్లెదుటే జరుగుతున్న అనేక పరిణామాలను బట్టి అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారు.

  English summary
  vizag leader,anakapalli ex mp sabbam hari was once a devotee of the ys rajasekhar reddy. When Jagan went to jail, he went to the party and his family also. After that, sabbam hari came out from ycp due to differences with Jagan. But, the latest talk is that the Sabbam Hari is going to join in TDP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X