వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరసాపురంలో కూడా ఓ కంగనా.. క్వీన్ ఫోటో పోస్ట్ చేసి కామెంట్, సోషల్ మీడియాలో వైరల్..

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియాలో నెటిజన్లు రెచ్చిపోతుంటారు. కరెంట్ ఇష్యూపై తమ అభిప్రాయాలను చెబుతుంటారు. అయితే ఇటీవల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. శివసేన సర్కార్- కంగనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కంగనా.. ముంబైని పీవోకే అనడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. వివిధ పరిణామాలతో.. కంగనా తనకు భద్రత కల్పించాలని కోరగా.. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. వై క్యాటగిరీతో భద్రత కల్పిస్తోంది. అయితే కంగనా.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును పోలుస్తూ.. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

కంగనా.. రఘురామ...

సుశాంత్ ఆత్మహత్యపై కంగనా రనౌత్ నోరు విప్పారు. తన అభిప్రాయం కాస్త పచ్చిగానే చెప్పడంతో వివాదం రాజుకుంది. శివసేన నేత సంజయ్ రౌత్ రంగంలోకి దిగి.. బెదిరించడం ప్రారంభించారు. ముంబై రావొద్దని ఆయన అంటే.. వస్తానని కంగనా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ముంబై.. ఏమైనా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరా అని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. దీంతో కంగనా-శివసేన మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరుకొంది. దీంతో తనకు భద్రత కావాలని కేంద్రాన్ని కంగనా.. కోరగా వై క్యాటగిరీ భద్రత కల్పించారు. ఆ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

నరసాపురంలో ఓ కంగనా...

నరసాపురంలో ఓ కంగనా...

అయితే కంగనా ఫోటోను కామన్ మ్యాన్ అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానినిక మన నరసాపురంలో కూడా ఓ కంగనా ఉంది అని రాశారు. ఇది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఉద్దేశించి చేసిన కామెంట్ అని స్పష్టమవుతోంది. పైగా అర్థమవుతోందా అంటూ.. తన కామెంట్ ఎండ్ చేశారు. కంగనా.. సుశంత్ మరణంపై అభిప్రాయం వ్యక్తం చేస్తే.. రఘురామ సొంత పార్టీ, సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ ప్రతినిధి బృందం.. రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ని కోరిన సంగతి తెలిసిందే.

ఢిల్లీకే పరిమితం..

ఢిల్లీకే పరిమితం..

రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆయన సీఎం జగన్‌పై విమర్శలు చేయడం, ప్రభుత్వ పథకాల తీరును తప్పుపట్టడంతో వైసీపీ నేతలు ముప్పేట దాడికి దిగారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, కేసులు నమోదు చేయడంతో రఘురామ ఢిల్లీకే పరిమితం అయ్యారు. తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి నెలకొంది అని.. భద్రత కల్పించాలని స్పీకర్‌ను కోరారు. ఇందుకు ఓం బిర్లా కూడా హోంశాఖకు లేఖ రాయడం.. కేంద్ర ప్రభుత్వం వై క్యాటగిరీ భద్రత కల్పించడం చకచకా జరిగిపోయాయి.

 10 మందితో సెక్యూరిటీ

10 మందితో సెక్యూరిటీ

ఇప్పుడు కంగనా ఇష్యూతో మరోసారి రఘురామను కామెంట్ చేస్తున్నారు. కంగనా మాదిరిగా ఫైర్ బ్రాండ్ అని అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. దీంతో మరోసారి చర్చకు దారితీసింది. మరీ కామన్ మెన్ పోస్టుకు రఘురామ అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలీ మరీ. ఇటీవల రఘురామకృష్ణ రాజుకు 10 మంది వరకు సెక్యూరిటీగా ఉన్న ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

English summary
one kangana in narasapuram: one kangana in narasapuram, netizen posted photo in twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X