శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సులో 1.35 కేజీల బంగారం పట్టివేత...

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళంలో ఓ వ్యక్తి నుంచి 1.35 కేజీల బంగారాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్సులో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా... అందులో భారీగా బంగారం బయటపడింది.

అతన్ని ఒడిశాలోని పర్లాకిమిడికి చెందిన సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. ఆర్టీసీ బస్సులో 1,351గ్రా. బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సులో అతని కదలికలపై అనుమానం రావడంతో స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించినట్లు తెలిపారు. అతని బ్యాగులో ఉన్న బంగారానికి ఎలాంటి రసీదు లేదని సంతోష్ చెప్పాడన్నారు. శ్రీకాకుళానికి చెందిన ఓ బంగారు ఆభరణాల షాపు యజమాని ఆర్డర్ మేరకు వాటిని తీసుకొచ్చినట్లు చెప్పాడన్నారు.

one kg of gold seized by police in srikakulam town on thursday

పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.65లక్షలు ఉంటుందన్నారు. సంతోష్ కుమార్ పర్లాకిమిడిలో ఓ బంగారం షాపులో పనిచేసే వ్యక్తిగా గుర్తించామన్నారు. అతను పనిచేసే షాపు యజమానిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Above 1 kg gold was seized by police on Thursday in Srikakulam town.Police said that they identified a man suspiciously roaming at Srikakulam RTC complex,after held him they checked his bag and found the gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X